'నా..నువ్వే' పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి
Send us your feedback to audioarticles@vaarta.com
కూల్ బ్రీజ్ సినిమాస్ నిర్మాణం లో, ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ సమర్పణ లో, నందమూరి కళ్యాణ్‌రామ్ కథానాయకుడిగా, అందాల భామ తమన్నా హీరోయిన్ గా, ప్రఖ్యాత యాడ్ ఫిలిం మేకర్ జయేంద్ర దర్శకత్వం లో రూపొందిన చిత్రం "నా.. నువ్వే".
నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే నెలాఖరు లో విడుదల కు సిద్ధం అవుతోంది. ఈ బుధవారం ( ఏప్రిల్ 18) సాయంత్రం 5 గంటలకు ఈ చిత్రం లో ని తొలి పాట ప్రోమో ని చిత్ర బృందం విడుదల చేస్తోంది. "చినికి చినికి చిలిపిగాలి తడి తగిలి.... " అని సాగే ఈ పాట ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ గా నిలుస్తుంది అని నిర్మాతలు తెలిపారు.
"కళ్యాణ్ రామ్, తమన్నా ల కాంబినేషన్, ప్రఖ్యాత కెమరామెన్ పి. సి. శ్రీరామ్ ఛాయాగ్రహణం, మ్యూజిక్ డైరెక్టర్ షరెత్ సంగీతం, ప్రముఖ కొరియోగ్రాఫర్ బృందా మాస్టర్ నృత్యాలు ఈ పాటకి ప్రత్యేక ఆకర్షణలు గా నిలుస్తాయి. ఈ పాట "నా.. నువ్వే" చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ గా నిలుస్తుంది" అని నిర్మాత ల లో ఒకరైన కిరణ్ ముప్పవరపు తెలిపారు
"ఒక టోటల్ ఫ్రెష్ లుక్ లో నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రం లో కనిపిస్తారు. అయన కి ఈ చిత్రం ఒక టోటల్ మేకోవర్ ని ఇస్తుంది అని నమ్ముతున్నాం. ఈ బుధవారం విడుదల చేయబోయే పాట మా అందరికీ చాలా ఇష్టం అయిన పాట" అని సమర్పకులు మహేష్ కోనేరు తెలిపారు.
లవ్, యాక్షన్, ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా గా ఉండే ఈ చిత్రం లో, కళ్యాణ్ రామ్, తమన్నా, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణ మురళి, వెన్నెల కిశోర్, ప్రవీణ్, బిత్తిరి సత్తి, ప్రియ, సురేఖ వాణి ప్రధాన నటులు.
ఈ చిత్రానికి నిర్మాతలు : కిరణ్ ముప్పవరపు , విజయ్ వట్టికూటి, సమర్పణ : మహేష్ ఎస్ కోనేరు , సంగీతం: షరెత్ , సినిమాటోగ్రఫీ: పి. సి. శ్రీరామ్ , ఎడిటింగ్: టి. ఎస్. సురేష్ , కథ, స్క్రీన్‌ప్లే - జయేంద్ర, శుభ, దర్శకత్వం: జయేంద్ర
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com