సెన్సార్ కార్యక్రమాల్లో 'నా కథలో నేను'
Send us your feedback to audioarticles@vaarta.com
జియస్కే ప్రొడక్షన్స్ పతాకంపై శివప్రసాద్ గ్రంథే స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తోన్న చిత్రం 'నా కథలో నేను'. సాంబశివ , సంతోషి శర్మ హీరో హీరోయిన్లుగా నటించారు. థ్రిల్లర్ కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ చిత్రం ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.
ఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాత శివప్రసాద్ గ్రంథే మాట్లాడుతూ..."ఈ భూమ్మీద ప్రతి ఒక్క దానికీ చావుంది. ఒక్క డబ్బుకు తప్ప. అదే డబ్బుకు చావుంటే మనిషి మనిషిగా బ్రతికే వాడనే లైన్ తో ఈ చిత్రం రూపొందింది. ఇంత వరకూ తెరపై రాని కొత్త కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం.
అంతా నూతన నటీనటులతో రూపొందించాం. ఏప్రిల్ మొదటివారంలో ఆడియో విడుదల చేసి..అదే నెలాఖరులో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. గత పదేళ్లుగా అనేక మంది దర్శకుల వద్ద పని చేసిన అనుభవంతో ఈ చిత్రాన్ని డైరక్ట్ చేసానని" అన్నారు.
ఈ చిత్రానికి సంగీతంః నవనీత; కెమెరాః లక్కీ ఏకారి; ఎడిటింగ్ః గణేష్; రచన-నిర్మాత-దర్శకత్వంఃశివప్రసాద్ గ్రంథే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments