'కాలా' గురించి 'నా బంగారు తల్లి' ఏమందంటే..
Send us your feedback to audioarticles@vaarta.com
'నా బంగారు తల్లి' సినిమాకుగాను ఉత్తమ నటిగా జాతీయ అవార్డును అందుకున్న నటి అంజలి పాటిల్. ఆ తర్వాత పలు హిందీ సినిమాలతో పాటు మరాఠి, ఆంగ్ల చిత్రాల్లోనూ నటిస్తూ వచ్చారు అంజలి. ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీ కాంత్, దర్శకుడు పా.రంజిత్ కలయికలో వస్తున్న'కాలా'లో ఓ ముఖ్య పాత్రలో నటించారు ఈ టాలెంటెడ్ యాక్ట్రస్.
రాజకీయ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో రజనీ మాఫియా డాన్‌గా కనిపించనున్నారు. ఈ సినిమాలో.. పుయల్ చారుమతి గైక్వాడ్ అనే పాత్రలో ముంబైలో జీవించే తమిళమ్మాయిగా కనిపించనున్నారు అంజలి. తాజాగా ఈ సినిమాకి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఆమె మీడియాతో పంచుకున్నారు.
సినిమాలో సగభాగాన్ని తమిళనాడులో చిత్రీకరించగా.. మిగిలిన భాగాన్ని మహారాష్ట్రలో షూటింగ్ చేశారని ఆమె తెలియజేశారు. రజనీ కాంత్ వంటి సూపర్ స్టార్‌తో కలిసి తెరను పంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నాననీ, ఆయనతో కలిసి చాలా సన్నివేశాల్లో కనిపిస్తానని ఆమె పేర్కొన్నారు.అంతేగాకుండా.. రజనీ కాంత్‌ను చూసి చాలా విషయాలు నేర్చుకున్నానని చెబుతున్నారు ఈ నేషనల్ అవార్డు విన్నర్.
ఇదిలా ఉంటే.. ధనుష్ నిర్మించిన ఈ చిత్రానికి 14 కట్స్‌తో సెన్సార్ "యూ/ఏ" సర్టిఫికేట్‌ను జారీ చేసినట్లు తెలుస్తోంది. కాగా.. ఈ నెల 27న చిత్రం విడుదల కావాల్సి ఉండగా.. జూన్ 15కు వాయిదా పడే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్ వర్గాలు తెలియజేస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments