ఎన్ 95 మాస్కులు కరోనాను కట్టడి చేయలేవు: డీజీహెచ్ఎస్
Send us your feedback to audioarticles@vaarta.com
ఎన్ 95 మాస్కుల వినియోగంపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్(డీజీహెచ్ఎస్) కీలక ప్రకటన చేసింది. ఎన్ 95 మాస్కుల వలన ఎలాంటి ఉపయోగమూ లేదని తెలిపింది. మన నోటి నుంచి విడుదలయ్యే వైరస్‌ను వాల్వ్ కలిగిన ఎన్ 95 మాస్క్ అడ్డుకోలేదని తెలియజేస్తూ అన్ని రాష్ట్రాల వైద్యాధికారులకూ లేఖలు రాసింది. నోరు, ముక్కు మూసేసి ఉన్న మాస్కులను మాత్రమే వాడాలని డీజీహెచ్ఎస్ సూచించింది. తప్పనిసరిగా స్టెరైల్ ఫీల్డ్‌ను మెయిన్‌టైన్ చేయాల్సిన ప్రదేశాల్లో కవాటాలున్న మాస్కులను వాడినట్టయితే మనం వదిలేసిన గాలిని అది నేరుగా అక్కడి వాతావరణంలోకి వదిలేస్తాయని.. అప్పుడు వైరస్ కట్టడి కోసం మాస్కులను వాడాలన్న నిబంధనకు అర్థమే లేకుండా పోతుందని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్(సీడీసీ) సూచించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments