తెలుగు »
Cinema News »
సునీల్ హీరోగా ఎన్.శంకర్ దర్శక నిర్మాణంలో మహాలక్ష్మి ఆర్ట్స్ ప్రొడక్షన్ నెం.2 సాంగ్స్ రికార్డింగ్ ప్రారంభం
సునీల్ హీరోగా ఎన్.శంకర్ దర్శక నిర్మాణంలో మహాలక్ష్మి ఆర్ట్స్ ప్రొడక్షన్ నెం.2 సాంగ్స్ రికార్డింగ్ ప్రారంభం
Friday, August 26, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
మలయాళంలో విజయవంతమైన టు కంట్రీస్ చిత్రాన్ని సునీల్ హీరోగా మహాలక్ష్మి ఆర్ట్స్ బ్యానర్‌పై పొడక్షన్ నెం.2గా రూపొందిస్తున్నారు. ఎన్.శంకర్ స్వీయ దర్శక నిర్మాణంలో రూపొందనున్న ఈ సినిమా సాంగ్స్ రికార్డింగ్ కార్యక్రమం శుక్రవారం ఉదయం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ప్రారంభమైంది. తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి సాంగ్ రికార్డింగ్‌ను ప్రారంభించారు. టీ న్యూస్ ఎం.డి.సంతోష్ కుమార్ స్క్రిప్ట్ అందించారు. అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో...
హీరో సునీల్ మాట్లాడుతూ - మలయాళంలో దిలీప్‌గారు చేసిన సినిమా టు కంట్రీస్. ఆయన గతంలో చేసిన సినిమాను తెలుగులో పూలరంగడు పేరుతో రీమేక్ చేసి సక్సెస్ సాధించాను. ఆయన సినిమాలు అచ్చి రావడంతో ఈ సినిమా చేస్తున్నాను. సినిమా చూశాను. చాలా బాగా నచ్చింది. ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసే ఫుల్ ప్లెజ్డ్ ఎంటర్‌టైనర్. నా స్టయిల్‌లో ఉంటూ సరదాగా సాగే డిఫరెంట్ కామెడి సినిమా ఇది. పూలరంగడు సినిమాకు డైలాగ్స్ అందించిన శ్రీధర్ సీపాన ఈ సినిమాకు డైలాగ్స్ రాస్తున్నాడు. అలాగే గోపీసుందర్‌తో తొలిసారి వర్క్ చేస్తున్నాను. మ్యూజిక్ ఫ్రెష్‌గా ఉంటుంది. '' అన్నారు.
గోపీ సుందర్ మాట్లాడుతూ - ''మలయాళ మాతృక టు కంట్రీస్‌కు నేనే మ్యూజిక్ అందించాను. ఇప్పుడు సునీల్‌గారు చేస్తున్న తెలుగు రీమేక్‌కు కూడా నేనే మ్యూజిక్ అందించడం ఆనందంగా ఉంది. శంకర్‌గారితో వర్క్ చేయడం హ్యాపీగా, కంఫర్ట్‌గా ఫీలవుతున్నాను'' అన్నారు.
శ్రీధర్ సీపాన మాట్లాడుతూ ''గతంలో సునీల్‌గారితో సక్సెస్‌ఫుల్ మూవీస్ పూలరంగడు, భీమవరం భుల్లోడు చిత్రాలు చేశాను. ఇప్పుడు ఆయనతో కలిసి చేస్తున్న మూడో సినిమా. ఎన్.శంకర్‌గారితో ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాం. మంచి డైలాగ్స్ అందించడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను'' అన్నారు.
దర్శకుడు ఎన్.శంకర్ మాట్లాడుతూ - ''మలయాళంలో దాదాపు 55 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిన టు కంట్రీస్ సినిమా బావుందని నా ఫ్రెండ్స్ చెప్పడంతో, సినిమా చూశాను. బాగా నచ్చింది. దిలీప్‌గారు సినిమాలు తెలుగులో రీమేక్ అయ్యి మంచి విజయం సాధించాయి. హీరో సునీల్ బాడీ లాంగ్వేజ్‌కు బాగా సూట్ అవుతుందనిపించడంతో ఆయన్ను కూడా సినిమా చూడమని అన్నాను. ఆయన కూడా సినిమా చూసి బావుందన్నారు. ఈ పాత్ర సునీల్‌గారు తప్ప ఎవరూ చేయలేరు. ఈ చిత్రం కామెడి ఎంటర్‌టైన్మెంట్ అయినా అన్నీ ఎమోషన్స్ ఉంటాయి. నా సినిమాలన్నీ కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్. ఇది యూనివర్సల్ మూవీ. అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది. ఇళయరాజాగారి తర్వాత అంత మంచి మ్యూజిక్ డైరెక్టర్‌గా గోపీసుందర్ కనిపించారు. మాతృతకకు కూడా ఆయనే సంగీతం అందించారు. ఓరిజినల్‌లో కూడా కొన్సి సాంగ్స్‌తో పాటు కొత్త సాంగ్స్ కూడా యాడ్ చేస్తాం.
శ్రీధర్‌సీపాన మంచి డైలాగ్స్ రాస్తున్నారు. సెప్టెంబర్ నుండి డిసెంబర్ వరకు సినిమా షూటింగ్ జరుగుతుంది. పదిహేను రోజులు హైదరాబాద్‌లో చిత్రీకరణ చేస్తాం. తర్వాత షెడ్యూల్ అవుట్ డోర్‌లో ఉంటుంది. 70 శాతం సినిమా అమెరికాలో చిత్రీకరిస్తాం. రెండు దేశాల మధ్య సున్నితమైన అంశాలతో జరిగే సినిమా. అలాగే ఓరిజినల్ ప్లేవర్ మిస్ కాకుండా స్క్రిప్ట్‌ను బెటర్ మెంట్ చేసి మన నెటివిటీకి తగినట్లు అన్నీ ఎలిమెంట్స్‌తో సినిమాను తెరకెక్కిస్తాం. ఈ ప్రాజెక్ట్ రూపకల్పనకు సూత్రధారి రాజారవీంద్ర ఈ సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నారు'' అన్నారు.
ఈ కార్యక్రమంలో పరిటాల శ్రీరాం, టీన్యూస్ సి.ఇ.వో.నారాయణరెడ్డి, బి.గోపాల్, క్రాంతిమాధవ్, సి.కల్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ, పరుచూరి గోపాలకృష్ణ, కె.అచ్చిరెడ్డి, ఎస్.వి.కృష్ణారెడ్డి, రాజా రవీంద్ర తదితరులు పాల్గొని యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలను తెలిపారు. సునీల్ నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్: ప్రకాష్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, సంగీతం: గోపీసుందర్, నిర్మాత, దర్శకత్వం: ఎన్.శంకర్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments