హిట్ డైరెక్టర్ని లాక్ చేసిన మైత్రీ మూవీస్..!!
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న అగ్ర నిర్మాణ సంస్థల్లో మైత్రీ మూవీ మేకర్స్ ఒకటి. చిరంజీవి, పవన్‌కల్యాణ్, ప్రభాస్, మహేశ్, అల్లు అర్జున్ వంటి స్టార్స్‌తో భారీ బడ్జెట్ చిత్రాలు, ఆ నెక్ట్స్ రేంజ్ హీరోలతో మీడియం బడ్జెట్ చిత్రాలు చేస్తూ గుర్తింపును సంపాదించుకుందీ సంస్థ. ఇప్పుడు ఈ సంస్థ ఓ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్‌తో సినిమా చేయడానికి నిర్ణయించుకుందట. అందుకోసం అతని అడ్వాన్స్ ఇచ్చి ఓ బై లింగ్వువల్(తెలుగు, తమిళం)లో ఓ సినిమా చేయడానికి ఒప్పందం చేసుకుందని అంటున్నారు. ఇంతకూ ఎవరా డైరెక్టర్?.. లోకేష్ కనకరాజ్.
లోకేష్ కనకరాజ్.. తమిళ దర్శకుడు ఇప్పటి వరకు మూడు సినిమాలను డైరెక్ట్ చేస్తే అందులో రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్స్ సాధించాయి. ఓ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. సందీప్ కిషన్‌తో ‘నగరం’, కార్తీతో ‘ఖైదీ’ చిత్రాలను లోకేష్ డైరెక్ట్ చేశారు. ఈ రెండు చిత్రాలు అటు తమిళం, ఇటు తెలుగులో ఘన విజయాలను సాధించాయి. ఇప్పుడు కోలీవుడ్ అగ్ర హీరో విజయ్‌తో ‘మాస్టర్’ సినిమాను తెరకెక్కించాడు. ఇది విడుదలకు సిద్ధంగా ఉంది. కాగా.. ఇప్పుడు ఈ డైరెక్టర్ తెలుగులో ఎవరితో సినిమా చేస్తాడనే ఆసక్తి అందరిలో పెరిగింది. మైత్రీ మూవీ మేకర్స్ ప్రస్తుతం తెలుగులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో ‘పుష్ప’ సినిమాను నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com