యంగ్ డైరెక్టర్ కు మైత్రి బంపర్ ఆఫర్.. రాంచరణ్ తో మూవీ!
- IndiaGlitz, [Wednesday,June 09 2021]
తన విభిన్నమైన స్టోరీ టెల్లింగ్ స్కిల్స్ తో యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్ ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తున్నాడు. సౌత్ లో అతడి క్రేజ్ క్రమంగా పెరుగుతోంది. బడా నిర్మాణ సంస్థలు అతడితో సినిమా చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. హీరో కార్తీతో తెరకెక్కించిన ఖైదీ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఘనవిజయం నమోదు చేసుకుంది.
ఇదీ చదవండి: బాలయ్య 'అఖండ' పోస్టర్: మెలితిరిగిన మీసం.. రాజసం ఉట్టిపడే నడక
ఆ తర్వాత ఇళయ దళపతి విజయ్ తో తెరకెక్కించిన మాస్టర్ కూడా సక్సెస్ అయింది. ఈ చిత్రంపై క్రిటిక్స్ పెదవి విరిచినా కలెక్షన్లు కుమ్మేసింది. ప్రస్తుతం కనకరాజ్ లోకనాయకుడు కమల్ హాసన్ తో 'విక్రమ్' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇదిలా ఉండగా కనకరాజ్ తదుపరి చిత్రంపై ఆసక్తికర ప్రచారం జరుగుతోంది.
చాలా కాలంగా లోకేష్ కనకరాజ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో సినిమా తీసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ మేరకు చర్చలు కూడా జరుగుతున్నాయి. ఈ క్రేజీ కాంబినేషన్ ని టేకప్ చేసేందుకు మైత్రి మూవీస్ సంస్థ ముందుకు వచ్చింది. తాజా సమాచారం మేరకు రాంచరణ్ తో తమ బ్యానర్ లో సినిమా చేస్తే రూ.5 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తామని ఆఫర్ చేసిందట.
తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా ఈ మూవీని మైత్రి నిర్మించనున్నట్లు టాక్. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది. లోకేష్ కనకరాజ్ వర్కింగ్ స్టైల్ కు ఇంప్రెస్ అయిన చరణ్ అతడితో సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నాడు.