హ్యాట్రిక్ కొట్టిన నిర్మాణ సంస్థ
Send us your feedback to audioarticles@vaarta.com
ఓ కొత్త నిర్మాణ సంస్థ నిర్మించిన మూడు భారీ బడ్జెట్ చిత్రాలు వరుస విజయాలు సాధించడమనేది అతి తక్కువ సందర్భాల్లోనే చూస్తుంటాం. అలాంటి ఘనతను సొంతం చేసుకున్న సంస్థ మైత్రీమూవీ మేకర్స్. 2015లో విడుదలైన శ్రీమంతుడుతో నిర్మాణ రంగంలోకి దిగిన ఈ సంస్థ.. తొలి సినిమాతో ఘనవిజయాన్ని అందుకుంది. మహేశ్ బాబు కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించారు.
ఆ తరువాత ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఇదే సంస్థ నిర్మించిన జనతా గ్యారేజ్ 2016లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా వసూళ్ళ వర్షం కురిపించింది. కట్ చేస్తే.. ఇప్పుడు ఇదే సంస్థ నిర్మించిన మరో భారీ బడ్జెట్ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అదే.. రంగస్థలం. రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించారు. వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాకి మంచి టాక్ వచ్చింది. కలెక్షన్స్ కూడా బాగున్నాయి. చూస్తుంటే.. ఈ నిర్మాణ సంస్థ హ్యాట్రిక్ కొట్టేలా ఉందంటున్నారు ట్రేడ్ పండితులు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments