క్రేజీ కాంబినేషన్‌పై మైత్రీ మూవీస్ కన్ను...
Send us your feedback to audioarticles@vaarta.com
పెళ్లిచూపులుతో హీరోగా సాలిడ్ హిట్ కొట్టి బ్రేక్ సాధించిన హీరో విజయ్ దేవరకొండ. తదుపరి చిత్రం అర్జున్ రెడ్డి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిపోయాడు. యూత్‌లో తిరుగులేని క్రేజ్ ఏర్పడింది. సందీప్ వంగా, విజయ్ దేవరకొండ వైపు ఎంటైర్ ఇండియన్ మూవీ ఇండస్ట్రీ తిరిగి చూసేలా చేసిన చిత్రం.. అర్జున్ రెడ్డి. ఇదే సినిమాను కబీర్‌సింగ్‌గా బాలీవుడ్లో రీమేక్ చేసి సందీప్ వంగా.. అక్కడ కూడా బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇప్పుడు ఈ క్రేజీ కాంబినేషన్లో సినిమా మరో సినిమా రూపొందనుందా? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి.
విజయ్ దేవరకొండ, సందీప్ వంగా కాంబోలో ఓ సినిమాను తెరకెక్కించడానికి ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తుంది. ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయట. సందీప్ రెడ్డి వంగా, ఇప్పుడు రణ్‌భీర్ కపూర్‌తో యానిమల్.. సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ సినిమాను డైరెక్ట్ చేసేలా ప్లాన్స్ జరుగుతున్నాయి. అంతా ఓకే అయితే, వీరి ప్రాజెక్ట్ నెక్ట్స్ ఇయర్ ట్రాక్ ఎక్కే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com