Manchu Manoj:నా మాటలను తప్పుగా అపార్థం చేసుకున్నారు.. మంచు మనోజ్ క్లారిటీ..

  • IndiaGlitz, [Thursday,March 21 2024]

తిరుపతిలో జరిగిన మోహన్ బాబు(Mohan Babu) జన్మదిన వేడుకల్లో మంచు మనోజ్(Manchu Manoj) చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున వైరల్ అయిన సంగతి తెలిసిందే. సొంత కుటుంబానికే సాయం చేయని వారికి ఓటు వేయకండని పరోక్షంగా ఓ పార్టీని ఉద్దేశించి మాట్లాడారని కొంతమంది తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలపై తాజాగా మనోజ్ స్పందించాడు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని క్లారిటీ ఇచ్చాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

మిత్రులకు, శ్రేయోభిషులకు, మీడియా సభ్యులకు ముందుగా ధన్యవాదాలు. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలను ప్రస్తావించాలనుకుంటున్నా. నా తండ్రి మోహన్ బాబు పుట్టినరోజు వేడుకల్లో నేను చెప్పిన మాటలను కొందరు అపార్థం చేసుకున్నారు. ఈవెంట్‌లో నా ప్రసంగం చుట్టూ కొంత గందరగోళం ఏర్పడింది. దేశంలో ఐక్యత, గౌరవం, రాజకీయ సరిహద్దులను అధిగమించడమే నా ప్రధాన ఉద్దేశం. దురదృష్టవశాత్తూ లైవ్ స్ట్రీమింగ్‌లో సాంకేతిక సమస్యల కారణంగా పూర్తిగా ప్రత్యక్ష ప్రసారం కాలేదు. అందువల్లే తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను వేదికపై ఉన్నప్పుడే అంతరాయం కలిగింది. అందుకే నా మాటల్లో కొన్ని మాత్రమే ప్రజలకు చేరాయి. ఈ పాక్షిక సమాచారాన్ని కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారు అని తెలిపాడు.

నా ప్రసంగంలో ఏ రాజకీయ నాయకుడిని లక్ష్యంగా చేసుకోలేదని స్పష్టంగా చెబుతున్నా. నా సందేశం కేవలం ఐక్యత, అవగాహనతో సార్వత్రిక విలువలను ప్రోత్సహించడమే లక్ష్యం. నాకు ఏ రాజకీయ పార్టీతో అనుబంధం లేదు. నా వ్యక్తిగత, కుటుంబ సంబంధాలను కొనసాగిస్తున్నా. సాంకేతిక లోపాలను గుర్తించి క్షమాపణలు చెప్పినందుకు సాంకేతిక బృందానికి కృతజ్ఞతలు. పూర్తి అవగాహన కోసం నా ప్రసంగాన్ని ఎవరైనా పూర్తిగా వీక్షించడానికి నా ట్విట్టర్ ఖాతాలో అప్‌లోడ్ చేశా. ఒక సినిమా నటుడిగా ప్రేక్షకులకు వినోదం అందించడం నా ముందున్న లక్ష్యం. మీ మద్దతు, నా కుటుంబం, నా పట్ల మీరు చూపే అపారమైన ప్రేమకు మీ అందరికీ ధన్యవాదాలు. మరోసారి బుల్లితెరపై మీ అందరినీ అలరించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అని పోస్ట్ చేశారు.

అసలు మనోజ్ ఏం మాట్లాడారంటే వాళ్ల ఫ్యామిలీకే హెల్ప్‌చేయనివాళ్లు. వాళ్ల చుట్టుపక్కల వారికే హెల్ప్ చేయనివాళ్లు. మీకేం హెల్ప్‌ చేస్తారు. అది గుర్తుపెట్టుకొని.. కరెక్ట్‌గా చూజ్‌ చేసుకొని మీకు మీ ఏరియాలో ఉన్న పేదవాళ్లకు ఏ లీడర్ వస్తే సపోర్టివ్‌గా ఉంటుందో అనలైజ్ చేసి కరెక్ట్‌గా ఓటు వేయండి. కష్టాల్లో ఉండి ఎక్కువ డబ్బు ఇచ్చే వాళ్లు ఉంటే వద్దని మీకు చెప్పను. ఆ డబ్బు ఇచ్చాడని ఓటు వేయొద్దు. డబ్బు ఇస్తే థాంక్యూ బ్రదర్ అని చెప్పండి. ఆ తర్వాత మీకు నచ్చిన వాళ్లకు ఓటు వేయండి. పదిమందిని కలుపుకొని వెళ్లే లీడర్‌ని వెతుక్కోండి అని తెలిపాడు. దీంతో ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫలానా పార్టీకి మద్దతుగా మాట్లాడారంటూ ప్రత్యర్థి పార్టీ అభిమానులు మనోజ్‌ను ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆ ట్రోలింగ్‌పై స్పందించారు.

More News

Vikasit Bharat: కేంద్రానికి ఈసీ బిగ్ షాక్.. వికసిత్ భారత్ సందేశాలు ఆపాలని ఆదేశాలు..

కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం బిగ్ షాక్ ఇచ్చింది. సోషల్ మీడియాలో వస్తున్న 'వికసిత్ భారత్' ప్రచారాన్ని వెంటనే ఆపాలని ఆదేశాలు జారీ చేసింది.

Rakshit Atluri:‘శశివదనే’ మూవీ ‘పలాస’ కంటే చాలా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను - హీరో రక్షిత్ అట్లూరి

‘పలాస 1978’ ఫేం రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘శశివదనే’.

Ruthuraj:చెన్నై సూపర్ కింగ్స్ సంచలన నిర్ణయం.. ధోనీ వారసుడిగా రుతురాజ్..

ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 17వ సీజన్‌కు రంగం సిద్ధమైంది. రేపు(శుక్రవారం) నుంచి ఐపీఎల్ కొత్త సీజన్ ప్రారంభం కానుంది.

AP Elections: ఎన్నికల సమరంలోకి జగన్‌, బాబు, పవన్.. రాష్ట్రమంతా హోరెత్తనున్న ప్రచారం..

ఏపీలో పొలిటికల్‌ హీట్ తారాస్థాయికి చేరుకుంది. పోలింగ్‌కు కేవలం 50 రోజులు మాత్రమే సమయం ఉండటంతో అన్ని పార్టీల నేతలు ప్రచారాన్ని హోరెత్తించనున్నారు.

BRS Party: బీఆర్ఎస్‌కు వరుస షాక్‌లు.. కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే..

పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి షాక్‌లు మీద షాక్‌లు తగులుతున్నాయి. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు వరుస పెట్టి కాంగ్రెస్ పార్టీలోకి క్యూ కడుతున్నారు.