Pawan Kalyan: 2024 ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి పోటీ చేయాలని నా ఆకాంక్ష: పవన్
- IndiaGlitz, [Friday,October 06 2023]
ఏపీలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు కూడా సకాలంలో వేతనాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని చెప్పారు. జగన్ జవాబుదారీతనం లేకుండా వ్యవహరిస్తున్నారని అన్నారు. రాజ్యాంగ ఉల్లంఘన వైసీపీ సర్కారు అలవాటుగా మారిపోయిందని తెలిపారు. అక్రమ కేసులు పెడుతూ భయానక వాతావరణాన్ని సృష్టస్తున్నారని అన్నారు. ఏపీలో జరుగుతున్నదంతా కేంద్రానికి తెలియజేశామని చెప్పారు. జనసేన ఎన్డీయే నుంచి జనసేన బయటకు వస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు. జనసేన ఇప్పటికీ ఎన్డీయేలోనే ఉందని.. తాము ఎవరితో ఉంటే లేకపోతే వైసీపీకి ఎందుకు అని ప్రశ్నించారు.
కేసుల మాఫీ కోసమే జగన్ ఢిల్లీ వెళ్తున్నారు..
జగన్, 30 మంది ఎంపీలు కేసులు మాఫీ చేయించుకోవడానికే ఢిల్లీ వెళ్తు్న్నారని ఆరోపించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హామీలు గురించి ఎందుకు కేంద్రాన్ని ప్రశ్నించడం లేదని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయినా పసుపు బోర్డును కేంద్రం ఇచ్చిందని.. కానీ జీడిపప్పు, కొబ్బరి బోర్డులు జగన్ ఎందుకు తీసుకురాలేకపోతున్నారని నిలదీశారు. మోదీ జీ20 సమావేశాల్లో బిజీగా ఉన్నప్పుడు నక్కలజిత్తు జగన్ చంద్రబాబును అరెస్ట్ చేశారన్నారు. చంద్రబాబును రాజమండ్రి జైలులో కలిసి మద్దతు ఇచ్చానని.. అలాంటి పరిణామాల నేపథ్యంలో కేంద్ర పెద్దలను సంప్రదించకుండా టీడీపీతో పొత్తు విషయం ప్రకటించానని క్లారిటీ ఇచ్చేశారు. మాతో పాటు బీజేపీ కూడా కలిసి వస్తుందని ఇప్పటికీ భావిస్తున్నామని స్పష్టంచేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా 2024లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీచేయాలనేది తన ఆకాంక్ష అని పవన్ వెల్లడించారు.
సినిమా ఇండస్ట్రీ సున్నితమైంది.. టార్గెట్ చేస్తారని భయపడతారు..
కృష్ణా జిల్లాలో జరిగిన వారాహి యాత్రకు అపురూపమైన స్పందన వచ్చిందన్నారు. జనవాణి కార్యక్రమంలో అనేక వర్గాల ప్రజలు తమ సమస్యలను నా దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. చంద్రబాబుపై అరెస్టుపై సినిమా ఇండస్ట్రీ పెద్దలు స్పందించపోవడంపైనా పవన్ స్పందించారు. ఇండస్ట్రీలో చాలా పొలిటికల్ గ్రూప్స్ ఉంటాయి.. చాలా సున్నితమైన మూవీ ఇండస్ట్రీలో ఎవరైనా మాట్లాడితే వారిని టార్గెట్ చేస్తారని భయపడతారని క్లారిటీ ఇచ్చారు. అలాగే వచ్చే ఎన్నికల్లో ఎక్కడినుంచే పోటీ చేస్తాననే అంశంపైనా పవన్ స్పందించారు. తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సేనాని వివరించారు.