బాహుబలి కంటే పెళ్లిచూపులకే నా ఓటు - దర్శకరత్న
Send us your feedback to audioarticles@vaarta.com
ఎంత పెద్ద హీరో అయినా బడ్జెట్ సినిమాల నుండే వస్తారు. నా దృష్టిలో చిన్న సినిమాలే లేవు. బాహుబలి గొప్ప చిత్రమైనా నేను నా ఓటును పెళ్ళిచూపులకే వేస్తాను. ఎందుకంటే నేను బడ్జెట్ చిత్రాలనే ఇష్టపడతానని దర్శకరత్న దాసరి నారాయణరావు అన్నారు. ఈరోజు జరిగిన పెళ్ళిచూపులు సినిమా థాంక్స్మీట్కు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు.
తరుణ్‌భాస్కర్ చాలా మంచి టెక్నిషియన్ తను పెళ్ళిచూపులు చిత్రాన్ని రియలిస్టిక్‌గా తెరకెక్కించాడు. ప్రేక్షకులు ఇలాంటి సినిమాలనే కోరుకుంటారు. ఈ సినిమా కచ్చితంగా 12-15 కోట్ల రూపాయలను కలెక్ట్ చేస్తుందని ఇలాంటి సినిమాలు ఓ పది సినిమాలు వస్తే తెలుగు ఇండస్ట్రీ నెంబర్‌వన్ అవుతుంది. అంతే తప్ప కొరియన్ సినిమాలనో, మరేదో సినిమాలను చూసి సినిమాలను చేసే వారిని దర్శకులు అనరు, కాపీ మాస్టర్లంటారు. తెలుగు దర్శకుల్లో క్రియేటివిటీ తగ్గిపోతుంది. సినిమా కథలను మన పరిసరాల నుండే తయారు చేసుకోవాలంటూ దాసరినారాయణరావు తెలియజేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments