నా వీడియో ఆ ఇద్దరికీ చేరాలి..: వి.వి.వినాయక్
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియో ముఖ్యంగా ఇద్దరికి చేరాలని ఆయన కోరారు. అసలు ఆ వీడియో ఆయనెందుకు చేశారు? ఎవరికి చేరాలనుకుంటున్నారు? వినాయక్ మాటల్లోనే...
‘‘నా వీడియో ఇద్దరికి చేరాలని పెడుతున్నాను. నేనొకసారి కెన్యాకు వెళ్లాల్సి వచ్చింది. అక్కడికి వెళ్లాలంటే ఎల్లో ఫీవర్ ఇంజక్షన్ వేసుకోవాలని చెప్పారు. వేయించుకోవడానికి వెళ్లినప్పుడు డాక్టర్ని ఎల్లో ఫీవర్ అంటే ఏమిటని అడిగాను. ఆయన పూర్తిగా కోవిడ్ లక్షణాలనే ఎల్లో ఫీవర్ లక్షణాలుగా వివరించారు. అనంతరం ఎల్లో బుక్ నా పాస్‌పోర్టుపై పెట్టారు. ఆ ఇంజక్షన్ వేయించుకుంటేనే కెన్యాకు రానిస్తారు.
ఆ ఇంజెక్షన్ వేయించుకోవచ్చా? అని ఇద్దరు డాక్టర్లను అడిగాను. వాళ్లు వద్దన్నారు తప్ప ఎందుకు వద్దో వివరించలేదు. అయితే అందులోని ఒక డాక్టర్ ఇటీవల కోవిడ్ గురించి సామాన్యులకు సైతం అర్థమయ్యేలా వివరించారు. అయతే ఆ ఇద్దరు డాక్టర్లు నా వీడియోను చూసి ఎల్లో ఫీవర్ గురించి.. ఆ ఇంజెక్షన్ ఎందుకు తీసుకోకూడదో వివరించాలి’’ అని వి.వి. వినాయక్ తన వీడియోలో కోరారు. ఆ వీడియో ప్రతి ఒక్కరికీ ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com