రజనీకాంత్ నాకు రోల్ మోడల్.. ‘దర్బార్‌’కు ఆల్ ది బెస్ట్ : బన్నీ

  • IndiaGlitz, [Tuesday,January 07 2020]

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే, టబు, సునీల్ నటీనటులుగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన చిత్రం ‘అల వైకుంఠపురములో..’. సినిమా రిలీజ్‌కు రోజులు దగ్గరపడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్స్ షురూ చేసింది. సోమవారం నాడు ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో ఘనం నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో అల్లు అర్జున్ ప్రసంగిస్తూ సినిమాకు సంబంధించి.. మెగాస్టార్ చిరంజీవితో పాటు పలు ఆసక్తికర విషయాలను ఆయన పంచుకున్నారు.

చిరు తర్వాత రజీనీనే!

చివరగా.. చిరంజీవి, సూపర్‌స్టార్ రజనీకాంత్ గురించి మాట్లాడారు. ‘నాకు చిరంజీవి గారంటే ప్రాణం. ఈ కట్టె కాలేవరకు చిరంజీవి గారి అభిమానినే. చిరంజీవి తర్వాత చాలా చాలా ఇష్టపడే వ్యక్తి సూపర్‌స్టార్ రజనీకాంత్. ఆయన నా రోల్ మోడల్.. అలాంటి ర‌జినీకాంత్‌గారి సినిమా రిలీజ్ అవుతుంది. నాకు ఇష్టమైన డైరెక్టర్ మురుగ‌దాస్‌గారు చేసిన సినిమా. ఈ సంక్రాంతికి ఆయ‌న సినిమా పెద్ద స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను. అలాగే మా సినిమాతో పాటు స‌రిలేరు నీకెవ్వరు సినిమా కూడా విడుద‌ల‌వుతుంది. మ‌హేశ్‌గారు స‌హా ఎంటైర్ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్‌. అలాగే నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి క‌ల్యాణ్‌రామ్‌గారి ఎంత‌మంచివాడ‌వురా సినిమా విడుద‌ల‌వుతుంది. ఆయ‌న‌కు కూడా అభినంద‌న‌లు. ఈ సంక్రాంతి అంద‌రికీ బావుండాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని బన్నీ చెప్పుకొచ్చారు. కాగా.. రజనీ గురించి బన్నీ చేసిన ఈ మాటలకు సంబంధించిన వీడియో క్లిప్‌ను రజనీ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

More News

విఘ్నేశ్‌తో విడిపోయారన్న వార్తలపై నయన్ క్లారిటీ

లేడీ సూపర్‌స్టార్ నయనతార గురించి నటన పరంగా ప్రత్యేకించి మరి చెప్పనక్కర్లేదు. ‘నాకు నేనే పోటీ.. నాకు నేనే సాటి’ అన్నట్టుగా నటించేస్తుంటుంది. అయితే రీల్ లైఫ్ వరకూ అంతా ఓకే గానీ..

మోదీని 'మంచు' కలవడం వెనుక కారణలివీ..!

టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబ సభ్యులు.. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అవ్వడంతో రకరకాలుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదిగో వైసీపీకి టాటా చెప్పేసి..

రాజశేఖర్ రాజీనామాపై జీవిత స్పందన ఇదీ...

టాలీవుడ్‌లో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి-యాంగ్రీస్టార్ రాజశేఖర్‌..

రాహుల్‌కే మళ్లీ కాంగ్రెస్ పగ్గాలు.. కారణాలివీ..!

కాంగ్రెస్ పార్టీ పగ్గాలు మళ్లీ యువరాజుకేనా..? తాత్కాలిక అధ్యక్ష పదవి నుంచి సోనియా గాంధీ తప్పుకోనున్నారా..?

షాకింగ్: ఏపీలోనూ ‘దిశ’ లాంటి ఘటనే!?

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా ‘దిశ ఘటన’ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.