Chief Minister of Telangana:రేవంత్ రెడ్డి అనే నేను.. తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం..

  • IndiaGlitz, [Thursday,December 07 2023]

తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ తమిళిసై సౌందర్‌ రాజన్ రేవంత్ రెడ్డి చేత ప్రమాణం చేయించారు. డిప్యూటీ సీఎంగా మల్లు భట్టివిక్రమార్క, మంత్రులుగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనరస్సింహ, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ప్రమాణస్వీకారం చేశారు.

ఇక ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక, జాతీయాధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, కర్టాటక సీఎం సిద్ధరామయ్య, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రుల ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు, అధికారులు పెద్దఎత్తున హాజరయ్యారు.

More News

Pragati Bhavan:ప్రగతి భవన్ కంచెలు బద్దలు.. ట్రాఫిక్ ఆంక్షలు ఎత్తివేత..

ప్రగతి భవన్ గేట్లు బద్దలయ్యాయి. అక్కడ ఉన్న ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు పూర్తి ఎత్తివేశారు.

Revanth:పెద్దమ్మతల్లిని దర్శించుకుని ఎల్బీ స్టేడియానికి రేవంత్..

మరికాసేపట్లో తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Telangana Ministers:తెలంగాణ మంత్రుల జాబితా ఇదే.. 11 మందికి చోటు..

కాసేపట్లో హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Bigg Boss Telugu 7 : టాస్క్‌ల్లో అర్జున్ దూకుడు.. కొట్టాడంటూ ప్రశాంత్‌ లొల్లి, వెదవ సోదీ  అంటూ ఇచ్చిపడేసిన అంబటి

బిగ్‌బాస్ 7 తెలుగు సీజన్ తుది అంకానికి చేరుకుంది. మరికొన్ని రోజుల్లో సీజన్ ముగియనుంది.

Revanth Reddy:సీఎంగా రేవంత్ రెడ్డి తొలి సంతకం దీని మీదే..

తెలంగాణ రెండో సీఎంగా కాసేపట్లో రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీఎం హోదాలో తొలి సంతకం ఆరు గ్యారంటీలపైనే పెట్టనున్నారు.