తెలుగు నేర్చుకోవాలని మా తాతగారు పట్టుబట్టారు: అల్లు శిరీష్
Send us your feedback to audioarticles@vaarta.com
అమ్మ ప్రేమలా స్వచ్ఛమైనది మన తెలుగు భాష. చిన్నారుల నవ్వులా స్వచ్ఛమైనది.. అమృతం కంటే తియ్యనైన తెలుగు భాషా దినోత్సవం నేడు. ఈ సందర్భంగా తెలుగు వారంతా ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు. సెలబ్రిటీలు సైతం ట్విట్టర్ వేదికగా తెలుగు భాష ఔన్నత్యాన్ని గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా అల్లు శిరీష్ కూడా తెలుగు భాష ఔన్నత్యాన్ని తాను తెలుగు నేర్చుకోవడానికి సహకరించిన తన తాతగారు, అమ్మకు ధన్యవాదాలు తెలిపుతూ ట్వీట్స్ చేశాడు.
‘‘దేశభాషలందు తెలుగు లెస్స’ - శ్రీ కృష్ణ దేవరాయలు. తెలుగు వారందరికీ తెలుగు భాషాదినోత్సవ శుభాకాంక్షలు. చెన్నైలో పెరిగిన నేను హిందీ, తమిళం మాత్రమే నేర్చుకున్నాను. మా తాత గారు మాత్రం మాతృభాషను నేర్చుకోవాలని పట్టుబట్టారు. దీనికోసం మాకు హోం ట్యూషన్ పెట్టించారు. తరువాత మా అమ్మ నాకు తెలుగు నేర్పింది. నాలో తెలుగు భాష, సంస్కృతికి పునాదులు వేసినందుకు వారిద్దరికీ ధన్యవాదాలు.
మా స్కూలులో హిందీ, తమిళ్ మాత్రమే నేర్పించేవాళ్లు. 14వ శతాబ్దంలో ప్రపంచాన్ని చుట్టి వచ్చిన నికోలో డి కాంటి తెలుగును ‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’ అని పిలిచారు. ఎందుకంటే తెలుగులోని చాలా పదాలు ఇటాలియన్ మాదిరిగానే అచ్చుతో ముగుస్తాయి’’ అని అల్లు శిరీష్ ట్వీట్లో పేర్కొన్నాడు.
"దేశభాషలందు తెలుగు లెస్స" - శ్రీ కృష్ణ దేవరాయలు. తెలుగు వారందరికీ తెలుగు భాషాదినోత్సవ శుభాకాంక్షలు, మీ అల్లు శిరీష్.#తెలుగుభాషాదినోత్సవం#TeluguLanguageDay
— Allu Sirish (@AlluSirish) August 29, 2020
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout