తెలుగు నేర్చుకోవాలని మా తాతగారు పట్టుబట్టారు: అల్లు శిరీష్

  • IndiaGlitz, [Saturday,August 29 2020]

అమ్మ ప్రేమలా స్వచ్ఛమైనది మన తెలుగు భాష. చిన్నారుల నవ్వులా స్వచ్ఛమైనది.. అమృతం కంటే తియ్యనైన తెలుగు భాషా దినోత్సవం నేడు. ఈ సందర్భంగా తెలుగు వారంతా ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు. సెలబ్రిటీలు సైతం ట్విట్టర్ వేదికగా తెలుగు భాష ఔన్నత్యాన్ని గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా అల్లు శిరీష్ కూడా తెలుగు భాష ఔన్నత్యాన్ని తాను తెలుగు నేర్చుకోవడానికి సహకరించిన తన తాతగారు, అమ్మకు ధన్యవాదాలు తెలిపుతూ ట్వీట్స్ చేశాడు.

‘‘దేశభాషలందు తెలుగు లెస్స’ - శ్రీ కృష్ణ దేవరాయలు. తెలుగు వారందరికీ తెలుగు భాషాదినోత్సవ శుభాకాంక్షలు. చెన్నైలో పెరిగిన నేను హిందీ, తమిళం మాత్రమే నేర్చుకున్నాను. మా తాత గారు మాత్రం మాతృభాషను నేర్చుకోవాలని పట్టుబట్టారు. దీనికోసం మాకు హోం ట్యూషన్ పెట్టించారు. తరువాత మా అమ్మ నాకు తెలుగు నేర్పింది. నాలో తెలుగు భాష, సంస్కృతికి పునాదులు వేసినందుకు వారిద్దరికీ ధన్యవాదాలు.

మా స్కూలులో హిందీ, తమిళ్ మాత్రమే నేర్పించేవాళ్లు. 14వ శతాబ్దంలో ప్రపంచాన్ని చుట్టి వచ్చిన నికోలో డి కాంటి తెలుగును ‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’ అని పిలిచారు. ఎందుకంటే తెలుగులోని చాలా పదాలు ఇటాలియన్ మాదిరిగానే అచ్చుతో ముగుస్తాయి’’ అని అల్లు శిరీష్ ట్వీట్‌లో పేర్కొన్నాడు.

More News

అత్యాచార ఆరోపణలపై కృష్ణుడు ఏమన్నారంటే..

తనపై 139 మంది అత్యాచారం జరిపారంటూ హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఓ యువతి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

రిజర్వేషన్లపై పూరి సంచలన వ్యాఖ్యలు.. దళిత సంఘాల ఫైర్..

డాషింగ్ డైరెక్టర్ పూరి మరో డేరింగ్ స్టెప్‌ తీసుకున్న విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా ఆయన పోడ్‌కాస్ట్ వీడియోలతో అనేక విషయాలపై

కింగ్ నాగార్జున కు బ్యూటిఫుల్ బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన 'లవ్ స్టోరీ' మూవీ టీమ్

యువ సామ్రాట్ నాగచైతన్య , సాయి పల్లవి జంటగా సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తీస్తున్న మూవీ ‘‘లవ్ స్టోరీ’’.

సీఎస్‌కే జట్టుకు మరో షాక్... జట్టు నుంచి రైనా అవుట్..

ఐపీఎల్‌కు సిద్ధమవుతున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి.

విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో నాగ‌చైత‌న్య 20వ చిత్రం 'థాంక్యూ'

యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెకంటేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై "థాంక్యూ"