నా సినిమా ఒక తండ్రికి ప్రేరణనివ్వడం ఆనందాన్నిచ్చింది: విజయశాంతి
Send us your feedback to audioarticles@vaarta.com
ఒక పోలీస్ అధికారిణి.. క్రైమ్ రేటు, మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉండే ఆంధ్రా-ఒడిశా రాష్ట్రాల సరిహద్దుల్లో విధులు... ఎన్ని కేసులను ట్రేస్ అవుట్ చేసినా రాని గుర్తింపు ఒకే ఒక్క ఘటనతో వచ్చింది. ఆమె మరెవరో కాదు.. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఎస్ఐ కొత్తూరు శిరీష. గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహాన్ని పొలం గట్ల మీద నుంచి మోస్తూ అంత్యక్రియలు నిర్వహించిన ఘటన ఎస్సై కొత్తూరు శిరీషను పోలీస్ డిపార్టుమెంటులోనే ప్రత్యేకంగా నిలబెట్టింది. దీనికి సంబంధించిన ఫోటో.. వీడియో కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంతే సామాన్యుల నుంచి పోలీసు ఉన్నతాధికారుల వరకూ ప్రతి ఒక్కరూ ఆమెను అభినందించారు.
అయితే దీనిపై ఓ ఇంటర్వ్యూలో శిరీష మాట్లాడుతూ.. తన తండ్రి కలను నిజం చేయడం కోసం పోలీస్ అయ్యానని తెలిపారు. విజయశాంతి నటించిన ‘కర్తవ్యం’ సినిమా ప్రేరణతో తాను ఎలాగైనా పోలీస్ ఆఫీసర్ కావాలని ఆయన కలలుకనేవారని తెలిపారు. తనకు ఎప్పుడూ అదే చెప్పేవారని... ఆయన కల నిజం చేయాలని చాలా శ్రమించానని శిరీష తెలిపారు. 2014లో ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యానన్నారు. అయితే తాను పోలీసు శాఖలో చేరలేకపోయాననే అసంతృప్తి మాత్రం ఇంట్లో అందరికీ ఉండేదని. కానీ తమ ఇంటి ఆర్థిక పరిస్థితి కారణంగా ఆ ఉద్యోగంలో కొనసాగానని వెల్లడించారు. చివరికి తన పట్టుదలతో ఎస్సై పోస్టు సాధించగలిగానని వెల్లడించారు.
శిరీష ఇంటర్వ్యూను చూసిన బీజేపీ నాయకురాలు, ‘కర్తవ్యం’ సినిమాలో హీరోయిన్గా నటించిన విజయశాంతి ఆనందంగా ఫీలయ్యారు. వెంటనే శిరీషకు అభినందనలు తెలియజేస్తూ ట్విట్టర్లో పోస్టు పెట్టిరు. ‘నేను నటించిన కర్తవ్యం సినిమా ఒక తండ్రికి ప్రేరణనిచ్చి, తన కూతురిని సమాజం మెచ్చే పోలీస్ అధికారిణిగా తీర్చిదిద్దడం నాకెంతో ఆనందం కలిగించింది. ఎన్ని ప్రతికూలతలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొని విధి నిర్వహణలో ముందుకు సాగుతున్న కాశీబుగ్గ ఎస్ఐ కొత్తూరు శిరీషకు నా అభినందనలు’’ అని విజయశాంతి ట్వీట్ చేశారు.
నేను నటించిన కర్తవ్యం సినిమా ఒక తండ్రికి ప్రేరణనిచ్చి, తన కూతురిని సమాజం మెచ్చే పోలీస్ అధికారిణిగా తీర్చిదిద్దడం నాకెంతో ఆనందం కలిగించింది. pic.twitter.com/SZIoWpIERZ
— VijayashanthiOfficial (@vijayashanthi_m) February 4, 2021
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments