‘ఆర్ఆర్ఆర్’ సెట్స్‌లో నా ఫీలింగ్ ఏంటంటే..: శ్రియా
Send us your feedback to audioarticles@vaarta.com
మార్చిలో లాక్డౌన్ కావడానికి ముందే, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి రాబోయే ‘ఆర్ఆర్ఆర్’ మూవీ కొంతమేర షూటింగ్ జరుపుకున్న విషయం తెలిసిందే. ఇందులో శ్రియా అతిథి పాత్రలో నటించింది. శుక్రవారం 38వ పుట్టినరోజు జరుపుకున్న శ్రియా ‘ఆర్ఆర్ఆర్’ మూవీ గురించి మాట్లాడుతూ.. ‘ఆర్ఆర్ఆర్’లో తనది అతిథి పాత్ర అయినప్పటికీ, ఛత్రపతి (2005) తర్వాత దర్శకధీరుడితో కలిసి పనిచేయడం చాలా బాగుందన్నారు. ఆయన గొప్ప విజన్ ఉన్న దర్శకుడని శ్రియా కొనియాడారు.
‘ఆర్ఆర్ఆర్’ సెట్స్‌లో ఉండటం వల్ల అత్యంత ప్రత్యేకమైన సినిమాలో తాను భాగమవుతున్నానన్న ఫీలింగ్ వచ్చిందని తెలిపింది. కరోనా మహమ్మారి త్వరలోనే ముగుస్తుందని.. దీంతో షూటింగ్ ముగించి సినిమాను విడుదల చేస్తారని శ్రియ తెలిపారు. తాను అజయ్ దేవ్‌గన్‌తో స్క్రీన్ పంచుకుంటున్నానని.. ఆయన చాలా ప్రొఫెషనలే కాకుండా చాలా గొప్ప వ్యక్తి అని శ్రియ తెలిపారు. అయితే తనకు తారక్, చరణ్‌లతో కలిసి పని చేసే అవకాశం దొరకలేదని.. కానీ ఈ సినిమాలో వాళ్లిద్దరూ చాలా అద్భుతమైన పాత్రల్లో నటిస్తున్నారని శ్రియ తెలిపింది.
ఇదిలా ఉండగా, మెర్లపాక గాంధీ హెల్మ్ చేయబోయే అంధాధున్ తెలుగు రీమేక్‌లో టబు పాత్రలో శ్రియా నటించనుందని ఓ న్యూస్ వైరల్ అయింది. దీనిపై శ్రియా స్పందించారు. ఈ పాత్ర కోసం తనను సంప్రదించినట్లు తెలపారు. దీనిపై చర్చలు కూడా జరిగాయని.. కానీ ఇంకా ఏమీ ఖరారు కాలేదని శ్రియా తెలిపారు. ప్రస్తుతం తాను బార్సిలోనాలో నివసిస్తున్నానని తెలిపారు. షూటింగ్ తిరిగి ప్రారంభం కావాలంటే నేను భారతదేశానికి వెళ్లాలన్నారు. టబు నటించిన సినిమాలను తాను చూశానని.. ఆమె ఒక అద్భుతమైన నటి అని శ్రియా కొనియాడారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com