నా అభిమాన రవితేజ టాప్‌లోకి వచ్చేశారు: రామ్ చరణ్
Send us your feedback to audioarticles@vaarta.com
మాస్ మహరాజ్ రవితేజకు ఈ సంక్రాంతి పండుగ మంచి జోష్ ఇచ్చింది. ఇటీవలి కాలంలో ఒకటీ అర మినహా ఆయనకు హిట్స్ అయితే ఏమీ లేవు. లాక్‌డౌన్ తర్వాత విడుదలైన సినిమాల పరంగా చూస్తే రవితేజ మాత్రం టాప్‌లో ఉన్నాడు. ఈ సినిమా కాసుల వర్షం కురిపిస్తోంది. అద్భుతమైన కమ్ బ్యాక్‌తో రవితేజ మంచి హిట్ కొట్టేశాడు. దీంతో రవితేజ మళ్లీ ఫామ్‌లోకి వచ్చేశాడు. రవితేజ.. దర్శకుడు గోపిచంద్ మలినేనిల కాంబో ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టేసింది. ఈ పండుగకు `క్రాక్`తో మాస్ అభిమానులకు మంచి కిక్ ఇచ్చాడు.
భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా.. ఏమాత్రం అభిమానులను డిజప్పాయింట్ చేయకుండా పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. లాక్‌డౌన్ తర్వాత విడుదలై మంచి విజయం సాధించడంతో సామన్యులే కాదు సినీ ప్రముఖులు కూడా చిత్రయూనిట్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ కూడా ట్విటర్ ద్వారా అభినందనలు తెలిపాడు. ‘‘క్రాక్’ సినిమాను బాగా ఎంజాయ్ చేశా. నా అభిమాన రవితేజ గారు టాప్‌లోకి వచ్చేశారు. శ్రుతీహాసన్ తన బెస్ట్ ఇచ్చింది. సముద్రఖని, వరలక్ష్మి చక్కగా నటించారు. ఇక, తమన్ నేపథ్య సంగీతం సినిమాను మరో స్థాయికి చేర్చింది. డైరెక్టర్ గోపీచంద్ ఎక్సెక్యూషన్ వేరే లెవెల్‌లో ఉంది’’ అని చెర్రీ ట్వీట్ చేశాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com