నా ఆరాధ్య నటి రేఖ.. అందుకే నా భార్యను.. : చిరంజీవి
Send us your feedback to audioarticles@vaarta.com
‘నటి రేఖ అంటే నాకు ఎంతో ఇష్టం. చిరంజీనా ఆరాధ్య నటి రేఖ.. అందుకే ఆ పేరుతో నా భార్య సురేఖను పిలుస్తుంటాను’ అని మెగాస్టార్ చిరంజీవి చెప్పుకొచ్చారు. అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని జాతీయ పురస్కారాల వేడుక ఘనంగా జరిగింది. అవార్డుల ప్రదానం అనంతరం చిరు మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘అక్కినేని జాతీయ పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం స్థాయికి చేరుతుంది.
శ్రీదేవి, రేఖలకు అక్కినేని జాతీయ పురస్కారం ఇవ్వడం ఎంతో సముచితమైన నిర్ణయం. అక్కినేని అవార్డుతో శ్రీదేవి, రేఖలకు సన్మానించుకోవడం గర్వంగా ఉంది. మరణించే ముందు కూడా నటించిన ఏకైక లేడీ సూపర్ స్టార్ శ్రీదేవి. రాజ్యసభలో రేఖ ఎంతో మంది నాయకులను డిస్టర్బ్ చేశారు. రేఖ రాకతో ఆ రోజు సభ సాగలేదు. రేఖ చేతుల మీదుగా ఫిల్మ్ ఫేర్ అవార్డు తీసుకోవడం మరిచిపోలేని జ్ఞాపకం’ అని చిరు చెప్పుకొచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout