నేటి ఉదయం నాన్నకు  ఆపరేషన్ జరిగింది: శ్రుతిహాసన్

  • IndiaGlitz, [Tuesday,January 19 2021]

ప్రముఖ నటుడు కమల్ హాసన్‌కి మంగళవారం ఉదయం ఆపరేషన్ జరిగింది. విపరీతమైన కాలు నొప్పితో బాధపడుతున్న ఆయన వైద్యుల సూచన మేరకు నేడు ఆపరేషన్ చేయించుకున్నారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తెలు శ్రుతి హాసన్, అక్షర హాసన్‌లు వెల్లడిస్తూ ఒక ప్రకటనను విడుదల చేశారు. తన తండ్రికి ఆపరేషన్‌ విజయవంతంగా పూర్తైందని వారు వెల్లడించారు. వైద్యులతో పాటు ఆసుపత్రి సిబ్బంది అంతా కమల్‌ పట్ల చాలా కేరింగ్‌గా ఉన్నారని ఆయన 4 - 5 రోజుల్లో కోలుకుంటారని శ్రుతి హాసన్ వెల్లడించారు.

‘‘మా నాన్న గారి ఆరోగ్యం పట్ల మీ అంతులేని సపోర్ట్, ప్రేయర్స్, నిజమైన కన్సర్న్‌కు మేము ధన్యవాదాలు చెబుతున్నాం. మా నాన్నగారికి ఆపరేషన్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తైంది. ఆయన కాలుకు నేడు శ్రీ రామచంద్ర హాస్పిటల్‌లో ఆపరేషన్ జరిగింది. డాక్టర్ మోహన్ కుమార్, డాక్టర్ జేఎస్ఎన్ మూర్తిల బృందం ఈ ఆపరేషన్‌ను చేశారు. వైద్యులతో పాటు ఆసుపత్రి మేనేజ్‌మెంట్, సిబ్బంది అంతా ఆయన త్వరగా కోలుకునేందుకు వీలుగా అద్భుతంగా నాన్నగారిని చూసుకుంటున్నారు.

ఆయన నాలుగైదు రోజుల్లో తిరిగి ఇంటికి వస్తారు. కొద్ది రోజుల విశ్రాంతి అనంతరం ఆపరేషన్ తాలుకు బాధ నుంచి కోలుకోగానే.. ప్రజలకు అందుబాటులో ఉంటారు. మీ అందరి ప్రేయర్స్‌, మీ అమితమైన ప్రేమాభిమానాలకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు అందిస్తున్న గుడ్ ఎనర్జీ ఆయన త్వరగా కోలుకునేందుకు సాయపడుతుంది’’ అని ప్రకటనలో శ్రుతి హాసన్, అక్షర హాసన్‌లు వెల్లడించారు.

More News

'Adipurush': Motion capture process kicked off

The team of 'Adipurush' on Tuesday revealed that the film's motion capture process has been begun today.

Ramya Pandian gets grand welcome after Bigg Boss 4 - video turns viral!

Actress Ramya Pandian was one of the most expected contestants of the just concluded season of the reality game show Bigg Boss 4 and had a huge fan following supporting her throughout

Here's how Akshay Kumar celebrated Army Day with the soldiers.

Akshay Kumar Army Day Soldiers Bachchan Pandey Bell Bottom

Here's how makers are planning to finish Rishi Kapoor's last film 'Sharmaji Namkeen'.

Rishi Kapoor Paresh Rawal last film Sharmaji Namkeen

Check out Harbhajan Singh and Siddharth Shukla's opinion on 'Tandav'.

Former cricketer Harbhajan Singh have praised the show and its amazing plotline in his recent tweet.