నేను 'ఇంద్ర'లో నటించాను.. అది నిజం చేసిన గొప్ప స్నేహితుడు రఘువీరా!
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి తన సినీ కెరీర్ లో మాత్రమే కాక రాజకీయ జీవితంలో కూడా ఎందరో స్నేహితులని సొంతం చేసుకున్నారు. చిరంజీవి మాటకు విలువిచ్చే తలపండిన రాజకీయ నేతలు ఎందరో ఉన్నారు. తాజాగా ఏపీ రాజకీయాల్లో కీలక నేత అయిన రఘువీరా రెడ్డి గురించి చిరంజీవి ఇచ్చిన వీడియో సందేశం వైరల్ గా మారింది.
ఇదీ చదవండి: తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తివేత.. కేబినెట్ నిర్ణయం!
చిరంజీవి కాంగ్రెస్ లో ఉన్నప్పుడు రఘువీరాతో ఆయన స్నేహం బలపడింది. తాజాగా చిరంజీవి రఘువీరా రెడ్డిపై ప్రశంసలు కురిపించాడు. రఘువీరారెడ్డి తన స్వగ్రామం నీలకంఠాపురంలో దేవాలయాల పునర్నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ దేవాలయాల ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతున్న సమయంలో చిరంజీవి రఘువీరా రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.
'నా రాజకీయ ప్రస్థానంలో నాకు దొరికిన గొప్ప స్నేహితుడు రఘువీరా రెడ్డి. మా మధ్య స్నేహం బలపడడానికి కారణం రఘువీరా రెడ్డి ఉన్నత వ్యక్తిత్వమే. సామాన్యుల పట్ల ప్రేమాభిమానాలు ఉన్న వ్యక్తి ఆయన. సీమ ప్రాంతానికి నీళ్లు తీసుకురావాలని నేను ఇంద్ర చిత్రంలో నటించాను. అది నిజం చేసి సీమ ప్రాంతానికి నీళ్లు తీసుకువచ్చిన రియల్ హీరో రఘువీరా.
ప్రస్తుతం రఘువీరా రెడ్డి దేవాలయాల పునర్నిర్మాణం అనే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆయనలో దైవ భక్తి, ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. మరికొన్ని కొత్త దేవాలయాలని నిర్మిస్తున్నారు. పరిస్థితులు చక్కబడ్డాక నేను ఆ దేవాలయాలని సందర్శిస్తాను. ఈ సందర్భంగా మిత్రుడు రఘువీరా రెడ్డికి శుభాకాంక్షలు' అని చిరంజీవి తన వీడియో సందేశంలో తెలిపారు.
Best wishes from former Central Minister, Megastar Chiranjeevi Garu, on the occasion of the inauguration of Neelakantapuram Temples. @KChiruTweets #NeelakantapuramGroupOfTemples #IncredibleIndia pic.twitter.com/0wNMLEZeb5
— Dr. N Raghuveera Reddy (@drnraghuveera) June 19, 2021
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com