కిషోర్‌కుమార్ ఏ పాత్రనైనా చేయగలడు అనిపించుకోవాలన్నదే నా కోరిక
- IndiaGlitz, [Monday,April 18 2022]
‘పద్మశ్రీ’, ‘నేనే నక్షత్ర’ చిత్రాలలో హీరోగా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన యువ నటుడు కిషోర్ కుమార్. కోవిడ్ తర్వాత విడుదలైన ప్రతి సినిమా కూడా రోజుల వ్యవధిలోనే కొత్త సినిమాలు థియేటర్స్ నుంచి కనుమరుగు అవుతున్న ప్రస్తుత రోజుల్లో ‘పద్మశ్రీ' చిత్రం 50 రోజులు విజయవంతంగా ప్రదర్శింపబడి అర్ధ శతదినోత్సవ వేడుకను కూడా జరుపుకుంది.
ఈ సందర్భంగా చిత్ర హీరో కిషోర్‌కుమార్ మీడియాతో ముచ్చటించారు. ‘‘నేను నటించిన ‘పద్మశ్రీ’ 50 రోజుల వేడుకను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది.నా నటనను గుర్తించి మంచి మెసేజ్ ఉన్న పద్మశ్రీ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శకుడు ఎస్. ఎస్ పట్నాయక్ కు మరియు నేనే నక్షత్ర దర్శకుడు సంగ కుమార్ కు ధన్యవాదాలు.ఒక జర్నలిస్టుగా, రైటర్ గా దర్శకుడు గా ఇలా అన్నింటిలో తానే అయ్యి ఎంత కష్టమైనా ఇష్టంతో “పద్మశ్రీ” వంటి మంచి కంటెంట్ ఉన్న సినిమా తీసి ఆ సినిమాను 50 డేస్ ఫంక్షన్ జరుపుకోవడం గొప్ప విషయం..పద్మశ్రీ 50 రోజుల ఫంక్షన్ లో తనకు చదువు నేర్పిన గురువులతో, దర్శకత్వంలో మెలుకులవు నేర్పిన గురువులతో, శ్రేయోభిలాషుల సమక్షంలో వారికి సన్మానం చేసుకున్న గొప్ప దర్శకుడు ఎస్.ఎస్.పట్నాయక్ అలాంటి ఆయన దర్శకత్వం వహించిన పద్మశ్రీ సినిమాలో నేను హీరోగా నటించినందుకు చాలా సంతోషంగా ఉంది.ఆ తరువాత హీరోగా చేసిన ‘నేనే నక్షత్ర’ చిత్రం కూడా నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. స్వతహాగా నేను మెగా ఫ్యామిలీ అభిమానిని. మెగా కాంపౌండ్ నిర్మించే చిత్రాల్లో హీరో గా చేయాలని నా కోరిక. నటుడిగా ఏ పాత్ర ఇచ్చినా దాన్ని ఛాలెంజ్‌గా తీసుకుంటాను. కిషోర్‌కుమార్ ఏ పాత్రనైనా చేయగలడు అనిపించుకోవాలన్నదే నా తపన.సినీ పరిశ్రమ లోని అందరు దర్శకుల చిత్రాల్లోనూ నటించాలని కోరిక ఉంది.అలాగే ఎంతో మంది నటులను ప్రేక్షకులకు దగ్గర చేసిన సినిమా పరిశ్రమ నాకు కూడా అదృష్టం కలిగిస్తుందనే నమ్మకం ఉంది. ప్రస్తుతం మూడు సినిమాలకు సంబంధించిన డిస్కషన్స్ జరుగుతున్నాయి. త్వరలోనే వివరాలు వెల్లడిస్తా. ఎంతో మందిని ప్రేక్షకులకు దగ్గర చేసిన సినిమా పరిశ్రమ నాకు కూడా ఆ అదృష్టం కలిస్తుందనే నమ్మకం ఉంది. ప్రేక్షకుల ఆశీర్వాదంతో తెలుగు సినీ చరిత్రలో ఒక హీరో గా మంచి స్థానం సంపాదిస్తాను. కమర్షియల్ రోల్స్, ఎక్స్‌పిరిమెంటల్ రోల్స్, నెగెటివ్ షేడ్స్ రోల్స్ ఇలా నటుడిగా నన్ను నేను ప్రూవ్ చేసుకునే పాత్రలు ఏవైనా చేయటానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాను’’ అన్నారు.