బయోపిక్‌లో సేతుపతి నటించడం హ్యాపీ!!

  • IndiaGlitz, [Thursday,July 25 2019]

ప్రస్తుతం బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖుల బయోపిక్‌లు బాక్సాఫీస్‌ షేక్‌ చేశాయి. అయితే తాజాగా.. శ్రీలంక క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ కూడా తెరకెక్కనుంది. ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి ప్రధాన పాత్ర పోషించనున్నాడు. ఇక ఈ మూవీకి ‘800’ అనే టైటిల్‌ను కూడా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మురళీధరన్ టెస్ట్ కెరీర్‌లో ‘800’ వికెట్లు పడగొట్టి తనకంటూ హిస్టరీ క్రియేట్ చేసుకున్నాడు. దీంతో సినిమా టైటిల్ కూడా ‘800’ ఫిక్స్ చేశారట.

ఇదిలా ఉంటే.. ఈ బయోపిక్‌లో మరళీధరన్ పాత్రలో ప్రముఖ తమిళ నటుడు, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటిస్తున్నాడు. 2019 డిసెంబర్‌లో ముత్తయ్య బయోపిక్ షూటింగ్ ప్రారంభంకానుంది. ఇండియాతో పాటు, శ్రీలంక, ఇంగ్లాండ్‌లోనూ షూటింగ్ జరుపనున్నారు.

చాలా సంతోషంగా ఉంది..!

కాగా.. ఈ చిత్రంపై తాజాగా ముత్తయ్య స్పందించారు. నా బయోపిక్‌లో విజయ్ సేతుపతి లెజండరీ స్పిన్నర్‌గా నటిస్తున్నారు. విజయ్ సేతుపతి వంటి నిష్ణాతుడైన నటుడు నా పాత్రలో పోషించడాన్ని నేను గౌరవిస్తున్నాను. 2020 చివరిలో విడుదల చేస్తున్నాం. నేను గత కొన్ని నెలలుగా సృజనాత్మక బృందంతో చురుకుగా సహకరిస్తున్నాను. నేను ఈ ప్రాజెక్టుకు మద్దతు ఇస్తూనే ఉంటాను అని ముత్తయ్య చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే.. దార్ మోషన్ పిక్చర్స్ ఈ బయోపిక్‌ను నిర్మిస్తుండగా.. దర్శకుడు శ్రీపతి రంగసామి తెరకెక్కిస్తున్నారు.

విజయ్ మాటల్లోనే..

ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‌లో నటించడం నాకు సంతోషంగా ఉంది. ముత్తయ్య తమిళ సంతతికి చెందిన క్రీడాకారుడు.. ప్రపంచవ్యాప్తంగా తనదైన ముద్ర వేసిన వ్యక్తి. మురళి పాత్రలో నటించడం నా ముందున్న సవాల్. మురళి స్వయంగా ఈ ప్రాజెక్టుతో సన్నిహితంగా పాల్గొంటారని.. క్రికెట్ అంశాలపై నాకు మార్గనిర్దేశం చేస్తారు అని విజయ్ సేతుపతి చెప్పుకొచ్చారు.

More News

పోటీకి సిద్ధ‌మ‌వుతోన్న సుదీప్ 'ప‌హిల్వాన్‌'

కన్నడ కథానాయుకుడు కిచ్చా సుదీప్ తెలుగు ప్రేక్షకులకు `ఈగ, బాహుబలి` చిత్రాలతో సుపరిచితులే. ఈయన టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘పహిల్వాన్’. ఎస్.కృష్ణ దర్శకుడు. స్వప్న కృష్ణ పహిల్వాన్ నిర్మాత.

బీజేపీ తీర్థం పుచ్చుకున్న ప్రముఖ సినీ నటి ప్రియా

ప్రముఖ సినీనటి ప్రియా రామన్‌ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బుధవారం నాడు తిరుపతిలో జరిగిన ఓ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యమూర్తి సమక్షంలో

నంది అవార్డు చిత్రం దర్శకుడి కొత్త చిత్రం

గతంలో నంది అవార్డు పొందిన చిత్రం హితుడు. కె.ఎస్.వి. పతాకంపై విడుదలైన ఆ చిత్రం విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది.

కొత్తోళ్లొద్దు.. పాతోళ్లే ముద్దంటున్న మాటల మాంత్రికుడు!!

సినీ ఇండస్ట్రీలోకి ఎందరో నటీనటులు వస్తుంటారు.. పోతుంటారు. సినిమాలుంటే పండుగ లేకుంటే అంతే సంగతులు ఇంటికే పరిమితం కావాల్సిందే మరి. అయితే ఈ జనరేషన్ గురించి చెబితే ఎంత మంది హీరోహీరోయిన్లు

పెళ్లిపై సల్లుభాయ్ సిల్లీ సమాధానం!!

ఇండియా మొత్తమ్మీద మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్ చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు.