సూర్య న్యూమూవీ అప్ డేట్
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళ హీరో సూర్య ప్రస్తుతం సింగం 3 చిత్రంలో నటిస్తున్నారు. హరి దర్శకత్వంలో రూపొందుతున్న సింగం 3 శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రం తర్వాత సూర్య నటించే చిత్రం ఏమిటనే విషయం పై కోలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. సూర్య తన నెక్ట్స్ మూవీ కబాలి ఫేం రంజిత్ దర్శకత్వంలో ఉంటుందని తెలియచేసారు.
ఇదిలా ఉంటే...తాజాగా సూర్యతో డైరెక్టర్ ముత్తయ్య ఓ చిత్రం చేయనున్నట్టు సమాచారం. కుట్టిపులి, కొంబన్, మరుదు..ఇలా వరుసగా మూడు విజయవంతమైన చిత్రాలను అందించిన ముత్తయ్య నాలుగవ చిత్రాన్ని సూర్యతో చేయనున్నాడు. మూడు చిత్రాలను గ్రామీణ నేపధ్యంతో తెరకెక్కించిన ముత్తయ్య సూర్యతో చేసే సినిమాకి కూడా గ్రామీణ నేపధ్యం ఎంచుకోవడం విశేషం. ఈ చిత్రంలో సూర్య తండ్రిగా రాజ్ కిరణ్ నటిస్తున్నారని తెలిసింది. ఈ మూవీకి తందై సొల్ మిక్క మందిరం ఇల్లై అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. అయితే...సింగం 3 తర్వాత సూర్య రంజిత్ తో సినిమా చేస్తారా..? ముత్తయ్యతో సినిమా చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com