25 ఏళ్ల 'ముఠామేస్త్రి'
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి అంటేనే మాస్ చిత్రాలకి కేరాఫ్ అడ్రస్. ఆయన నటించిన పలు చిత్రాలు మాస్ ఆడియన్స్‌ని టార్గెట్ చేసుకుని రూపొందాయి. బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించాయి. అలాంటి సినిమాలలో 'ముఠామేస్త్రి' ఒకటి. లోకల్ మార్కెట్‌లో ఓ ముఠాకి మేస్త్రిగా ఉండే బోస్ అనే యువకుడు.. అనూహ్యంగా రాజకీయాల్లోకి వెళ్ళాక ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు? అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది.
చిరుతో అధిక చిత్రాలు చేసిన దర్శకులలో ఒకరైన ఎ.కోదండరామిరెడ్డి.. మెగాస్టార్ కాంబినేషన్‌లో చేసిన చివరి చిత్రమిది. మీనా, రోజా తొలిసారిగా చిరుతో రొమాన్స్ చేసిన ఈ చిత్రానికి రాజ్ కోటి అందించిన సంగీతం ఎస్సెట్‌గా నిలిచింది. ముఖ్యంగా టైటిల్ ట్రాక్ ఓ ప్రభంజనం సృష్టించింది. అలాగే అంజనీ పుత్రుడా, ఎంత ఘాటు ప్రేమయో పాటలు కూడా బాగా పాపులర్ అయ్యాయి.
ఈ సినిమా కోసం నాలుగోసారి ఉత్తమనటుడిగా ఫిల్మ్ ఫేర్ పురస్కారాన్ని అందుకున్నారు చిరు. జనవరి 17, 1993న విడుదలైన ముఠామేస్త్రి.. నేటితో 25 వసంతాలను పూర్తిచేసుకుంటోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments