Asaduddin Owaisi:ముస్లింలు ఎక్కువగా కండోమ్లు వాడతారు.. అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు..
Send us your feedback to audioarticles@vaarta.com
దేశంలో స్వార్వత్రిక ఎన్నికల ప్రచారం వాడివేడిగా జరుగుతోంది. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇప్పటికే రెండు విడతల పోలింగ్ ముగియగా.. మిగిలిన ఐదు విడతల్లో సత్తా చాటేందుకు అన్ని పార్టీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే విమర్శలకు పదునుపెడుతున్నాయి. తాజాగా ప్రధాని మోదీపై ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఎంతకాలం ప్రజల్లో ముస్లింల పట్ల భయాన్ని సృష్టిస్తారని మండిపడ్డారు. తమ మతం వేరు కానీ తాము కూడా భారతీయులం అని స్పష్టంచేశారు.
హైదరాబాద్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారం ఒవైసీ మాట్లాడుతూ ‘ముస్లింలు ఎక్కువ మంది పిల్లలను కంటారనే భయాన్ని ఎందుకు సృష్టిస్తున్నారు? మోదీ ప్రభుత్వ గణాంకాల ప్రకారం ముస్లింల జనాభా పెరుగుదల, సంతానోత్పత్తి తగ్గింది. ముస్లింలు ఎక్కువగా కండోమ్లు వాడతారు, ఇలా చెప్పడానికి నాకు సిగ్గుగా లేదు... ముస్లింలు మెజారిటీ వర్గం అవుతారని నరేంద్ర మోదీ హిందువులలో భయాన్ని పెంచుతున్నారు. ఎంతకాలం ముస్లింల పట్ల భయాన్ని సృష్టిస్తారు? మా మతం వేరు కానీ మేము భారతీయులం’ అని ఒవైసీ పునరుద్ఘాటించారు.
కాగా ఏప్రిల్ 21న రాజస్థాన్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ.. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ‘కాంగ్రెస్ పార్టీ మన తల్లులు, చెల్లెళ్ల మెడలో మంగళసూత్రాలను లాగేసుకుంటుంది. దేశ ప్రజల ఆస్తిని లాక్కుని ఎక్కువ మంది పిల్లలు(ముస్లింలు) ఉన్నవారికి పంచడానికి సిద్ధమైంది. అలాగే దేశంలో చొరబాటుదారులకు కూడా పంచుతుంది. మీరు కష్టపడి సంపాదించిన సొమ్ము, చొరబాటుదారులకు వెళ్లాలా?’అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అయితే ప్రధాని వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తీవ్రంగా స్పందించింది. తమ మేనిఫెస్టోలో అలాంటి హామీలు ఇవ్వలేదని స్పష్టంచేసింది. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ కౌంటర్ ఇచ్చింది. అలాగే ఎన్నికల సంఘానికి కూడా మోదీపై ఫిర్యాదుచేసింది. దీంతో ఈసీ మోదీకి నోటీసులు జారీ చేసింది. తాజాగా అసదుద్దీన్ కూడా మోదీ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాయి. మరి ఒవైసీ వ్యాఖ్యలపై మోదీ కానీ బీజేపీ నేతలు కానీ స్పందిస్తారో లేదో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com