ఒక్క ట్వీట్‌తో రూ.1.10 లక్షల కోట్లు కోల్పోయిన మస్క్

  • IndiaGlitz, [Tuesday,February 23 2021]

ఒకే ఒక్క ట్వీట్ కొంపముంచింది. లక్ష కోట్ల రూపాయలకు పైగా పోయేలా చేసింది. షాకింగ్‌గా అనిపించినప్పటికీ ఇది అక్షరాలా నిజం. ప్రముఖ విద్యుత్‌ కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత, ప్రపంచ సంపన్నుల్లో ఒకరైన ఎలాన్‌ మస్క్‌.. ఒక్క ట్వీట్‌తో భారీగా నష్టపోయారు. బిట్‌కాయిన్‌లపై ఆయన చేసిన ట్వీట్‌ వైరల్‌ కావడంతో కేవలం ఒకే ఒక్క రోజులో ఆయన 15 బిలియన్‌ డాలర్లు అంటే మన కరెన్సీలో 1.10 లక్షల కోట్ల రూపాయలు కోల్పోయారు.

క్రిప్టోకరెన్సీపై మస్క్‌ గతవారం తన ట్విటర్‌ ఖాతాలో స్పందించారు. నిజానికి ఎప్పుడూ క్రిప్టో కరెన్సీని సపోర్ట్ చేసే మస్క్.. ఈసారి కాస్త రూటు మార్చారు. అదే కొంపముంచింది. ‘చూస్తుంటే బిట్‌కాయిన్‌, ఎథర్‌ క్రిప్టోకరెన్సీ ధర ఎక్కువగా ఉన్నట్లు అన్పిస్తోంది’ అని పోస్ట్‌ చేశారు. సాధారణంగా ఎప్పుడూ బిట్‌కాయిన్‌కు అనుకూలంగా మాట్లాడే మస్క్‌.. ఇలాంటి అభిప్రాయం చెప్పడంతో ఆ ట్వీట్‌ వైరల్‌ అయ్యింది. ఇక అంతే.. టెస్లా ఈక్విటీ వాటాలను విక్రయించేందుకు ఇన్వెస్టర్లు క్యూ కట్టారు. దీంతో సంస్థ ఈక్విటీ విలువ పడిపోయింది. సోమవారం నాటి అమెరికా స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో టెస్లా షేరు విలువ అమాంతం 8.6శాతం కుంగింది.

ఎలన్ మస్క్, తన ట్వీట్ల ద్వారా నష్టం తెచ్చుకోవడం కొత్తేమీ కాదు. గతంలో పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, వేల కోట్లను పోగొట్టుకున్నారు. గత ఏడాది కాలంగా 400శాతం పెరిగిన క్రిప్టోకరెన్సీ విలువ మస్క్‌ ట్వీట్‌ తర్వాత పడిపోయింది. 2020 సెప్టెంబరు తర్వాత కంపెనీ షేర్లు ఇంత భారీగా పడిపోవడం మళ్లీ ఇప్పుడే కావడం గమనార్హం. తాజా పతనంతో మస్క్‌ నికర సంపద 15.2 బిలియన్‌ డాలర్లు(అంటే భారత కరెన్సీలో రూ. 1.10లక్షల కోట్లు) తగ్గి 183.4 బిలియన్‌ డాలర్లుగా ఉన్నట్లు బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ సూచీ వెల్లడించింది. ఈ దెబ్బతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో నెంబర్ 1 స్థానాన్ని కూడా మస్క్ కోల్పోయారు.

More News

స్మార్ట్ ఫోన్ నుంచి కూడా కరోనా సోకే అవకాశం ఉందట..

కాదేదీ కరోనాకు అనర్హం అన్నట్టుగా ప్రస్తుత పరిస్థితులు మారిపోయాయి. కరోనా మహమ్మారి అదుపులోకి వచ్చింది..

అందుకే 'చెక్' సినిమా కోసం అడగ్గానే వెంటనే ఓకే చెప్పేశాను - ప్రియా ప్రకాశ్ వారియర్

ప్రియా ప్రకాశ్ వారియర్... యువతరం ప్రేక్షకులు ఈ అమ్మాయిని మర్చిపోవడం అంత సులభం కాదు.

మార్చి 5న `పవర్ ప్లే'

యంగ్ హీరో రాజ్ త‌రుణ్, కొండా విజ‌య్ కుమార్‌ల‌ స‌క్సెస్‌ఫుల్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న లేటెస్ట్ మూవీ `పవర్ ప్లే`.

ఎమ్మెల్యే రాపాకకు ఝలక్ ఇచ్చిన జనసైనికులు..

జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై.. ఆ పార్టీకే ఝలక్ ఇచ్చారు రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. దీనిని మనసులో పెట్టుకున్నారో ఏమో కానీ జనసైనికులు

ఓటీటీలోకి ఉప్పెన.. నెట్‌ఫ్లిక్స్ ఎంతకు కొనుగోలు చేసిందంటే..!

‘ఉప్పెన'తో మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్‌ తేజ్‌ రికార్డులను తిరగరాస్తున్నాడు.