మ్యూజికల్ హిట్ 'శీను'కి 18 ఏళ్లు

  • IndiaGlitz, [Sunday,August 27 2017]

'బిచ్చ‌గాడు' వంటి సంచ‌ల‌న విజ‌యం సాధించిన చిత్రాన్ని రూపొందించి వార్త‌ల్లోకి ఎక్కిన‌ ద‌ర్శ‌కుడు శ‌శి.. తెలుగులో చాన్నాళ్ల క్రిత‌మే ఓ సినిమాని రూపొందించాడు. అదే శీను. త‌మిళంలో శ‌శినే రూపొందించిన సొల్లామ‌లే చిత్రానికి రీమేక్ వెర్ష‌న్ ఇది. వెంక‌టేష్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టి ట్వింకిల్ ఖ‌న్నా హీరోయిన్‌గా న‌టించింది. క‌థానాయిక‌గా బిజీ ఉన్నప్ప‌టికీ నాటి అందాల న‌టి రాశి మొద‌టిసారిగా ప్ర‌త్యేక గీతంలో మెరిసిందీ సినిమా కోసం.

ఫీల్‌గుడ్ మూవీగా రూపొందిన ఈ చిత్రానికి మ‌ణిశ‌ర్మ అందించిన సంగీతం హైలెట్‌గా నిలిచింది. ప్రేమంటే ఏమిటంటే, హ‌ల్లో నేరేడు క‌ళ్ల‌దానా, ఏ కొమ్మ‌కాకొమ్మ‌, ఏమ‌ని చెప్ప‌ను ప్రేమా.. ఇలా పాట‌ల‌న్నీ సూప‌ర్ హిట్టే అయ్యాయి. సూప‌ర్‌గుడ్ ఫిల్మ్స్ బేన‌ర్‌పై ఆర్‌.బి.చౌద‌రి నిర్మించిన ఈ చిత్రం ఆశించిన విజ‌యం సాధించ‌న‌ప్ప‌టికీ.. మ్యూజిక‌ల్‌గా మాత్రం ఓ సెన్సేష‌న్‌. ఆగ‌స్టు 27, 1999న విడుద‌లైన మ్యూజిక‌ల్ హిట్ 'శీను' నేటితో 18 వ‌సంతాల‌ను పూర్తిచేసుకుంటోంది.

More News

20లోకి మెగాస్టార్ 'చూడాలని ఉంది'

'హిట్లర్'తో సెకండ్ ఇన్నింగ్స్ కి శ్రీకారం చుట్టిన మెగాస్టార్ చిరంజీవి.. మరో రెండు సినిమాల తరువాత ఇండస్ట్రీ హిట్ ఇచ్చి అప్పట్లో సంచలనం సృష్టించాడు. అలా ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఆ చిత్రమే 'చూడాలని ఉంది'.

హన్సిక స్థానంలో క్యాథరిన్...

హీరోయిన్ క్యాథరిన్..స్పెషల్ సాంగ్స్, సెకండ్ హీరోయిన్ పాత్రల్లో కూడా అలరిస్తుంది. తనకు కాన్సెప్ట్ నచ్చితే చాలు సెకండ్ హీరోయిన్గానా, లేక స్పెషల్ సాంగ్ అని ఆలోచించుకోను, చేయడానికి సిద్ధపడిపోతానని ఓ ఇంటర్వ్యూలో తెలియజేసింది.

మహనుభావుడు టీజర్ కి అరకొటి ప్లస్ డిజిటల్ వ్యూస్

శర్వానంద్ హీరోగా, మెహరిన్ హీరోయిన్ గా, దర్శకుడు మారుతి దర్శకత్వంలో యు.వి.క్రియోషన్స్ బ్యానర్ లో వంశి, ప్రమెద్ లు సంయుక్తంగా తెరకెక్కించిన మహనుభావుడు చిత్రం టీజర్ ని అగష్టు 24న విడుదల చేశారు.

రొమేనియాలో 'స్పైడర్' పాట చిత్రీకరణ

సూపర్స్టార్మహేష్, ఎ.ఆర్.మురుగదాస్కాంబినేషన్ లో ఠాగూర్మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా ఎల్ఎల్పి, రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్ పతాకాలపై ఎన్.వి.ప్రసాద్నిర్మిస్తున్న భారీ చిత్రం 'స్పెడర్'.

రామెజి ఫిల్మ్ సిటిలో 'నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా'

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అనుఇమ్మాన్యూయేల్ లు జంటగా వక్కంతం వంశి దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కుతున్న చిత్రం "నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా".