SS Thaman : గోవింద నామస్మరణం.. జై బాలయ్య స్లోగన్ రెండూ ఒకటేనా, ఏంటిది థమన్.. విరుచుకుపడుతున్న నెటిజన్లు

  • IndiaGlitz, [Monday,January 16 2023]

ఎస్ఎస్ థమన్... ఇప్పుడు దక్షిణాది సినీ సంగీత ప్రపంచాన్ని ఏలుతున్న మ్యూజిక్ డైరెక్టర్. టాప్ హీరోలే కాదు.. చిన్నా చితకా హీరోలకు కూడా ఇప్పుడు మ్యూజిక్ అంటే థమనే కేరాఫ్ అడ్రస్. చాలా తక్కువ స్పాన్‌లో వందలాది చిత్రాలకు ఆయన స్వరాలు సమకూర్చారు. ఇక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో ఆయనకు తిరుగేలేదు. సినిమాలో ఆల్రెడీ మ్యూజిక్ డైరెక్టర్ వున్నప్పటికీ... థమన్‌కే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాధ్యతలు అప్పగిస్తున్నారు మేకర్స్. పాత ట్యూన్‌‌లను లేపేస్తాడని, సొంతంగా ఆలోచించడం రాదంటూ ట్రోలింగ్ జరిగినా థమన్‌కు మాత్రం అవకాశాలు ఏమాత్రం తగ్గడం లేదు.

ఫ్యాన్స్‌ను ఊపేస్తోన్న జై బాలయ్య సాంగ్:

అయితే థమన్ అప్పుడప్పుడు అనుకోని వివాదాల్లో చిక్కుకుంటూ వుంటారు. తాజాగా నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన వీరసింహారెడ్డి సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన తొలి ఆట నుంచే మంచి టాక్ రావడం, పైగా పండగ సీజన్ కావడంతో వీరసింహారెడ్డి కలెక్షన్లను కుమ్మేస్తున్నాడు. ఈ సినిమాలోని జై బాలయ్య సాంగ్ నందమూరి అభిమానులకు మంచి కిక్కిస్తున్న సంగతి తెలిసిందే. వారికి ‘‘జై బాలయ్య’’ స్లోగన్ అంటే ఎంత ఇష్టమో దృష్టిలో పెట్టుకుని ఈ సాంగ్‌ను డిజైన్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే వీరసింహారెడ్డి సినిమాలో బాలయ్య పేర్లు .. వీరసింహారెడ్డి, జైసింహారెడ్డి. మరి సంబంధం లేకుండా జై బాలయ్య పాటేంటి అంటూ అప్పట్లో కొందరు పెదవి విరిచారు కూడా. కానీ మేకర్స్ వీటిని పట్టించుకోలేదు.

నోరు జారిన థమన్ :

తాజాగా జై బాలయ్య పదానికి సంబంధించి థమన్ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. గోవింద నామస్మరణం, జై బాలయ్య అనే స్లోగన్ అనేవి రెండూ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వినిపిస్తాయన్నారు. అందుకే వీరసింహారెడ్డిలో జై బాలయ్య అనే పాటను పెట్టినట్లుగా థమన్ చెప్పుకొచ్చాడు. దీంతో నెటిజన్లు థమన్‌ను ఆడుకుంటున్నారు. భక్తితో గోవిందా గోవిందా అంటూ చేసే శ్రీవారి నామస్మరణకు, జై బాలయ్యకు తేడా లేదా అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. మరి దీనిపై థమన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
 

More News

Mukarram Jah : 8వ నిజాం ముకరం ఝా టర్కీలో కన్నుమూత.. అంత్యక్రియలు హైదరాబాద్‌లోనే, కేసీఆర్ సంతాపం

హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలించిన నిజాం నవాబుల కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది.

RRR Movie : గోల్డెన్ గ్లోబ్ జోష్‌లో వుండగానే.. కీరవాణికి మరో ప్రతిష్టాత్మక పురస్కారం, నెక్ట్స్ టార్గెట్ ఆస్కారే

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్‌కి ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్

Shweta Basu: ముఖంలో కళ లేక.. బక్కచిక్కిపోయి, గుర్తు పట్టలేనంతగా మారిపోయిన శ్వేతాబసు ప్రసాద్

సినీ పరిశ్రమ అనేది రంగుల ప్రపంచం. ఇక్కడ గుమ్మడికాయంత టాలెంట్ వుంటేనే సరికాదు.. ఆవగింజంత అదృష్టం కూడా వుండాలి.

Waltair Veerayya : అనసవర సీన్‌లొద్దు.. నిర్మాతల డబ్బు వేస్ట్ చేయొద్దు : చిరంజీవి సంచలన వ్యాఖ్యలు

సినిమాల నిర్మాణం, పరిశ్రమలోని సమస్యలకు సంబంధించి మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబీ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన వాల్తేర్ వీరయ్య

ప్రకృతి, సైన్స్, అనుబంధాలు, ఆరోగ్యం, ఆనందం.. 'సంక్రాంతి' వెనుక పరమార్థం ఇదే

భారతీయుల పండుగలు, ఆచార వ్యవహారాల వెనుక ఖచ్చితంగా ఏదో ఒక శాస్త్రీయత దాగి వుంటుంది.