‘పింక్’ రీమేక్ : ట్రెండ్ సెట్ చేస్తున్న థమన్!
Send us your feedback to audioarticles@vaarta.com
జనసేనాని, పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ ‘పింక్’ రీమేక్ ద్వారా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఎక్కడా అధికారికంగా సమాచారం రాకున్నప్పటికీ అనధికారికంగా పవన్ ఇప్పటికే రెండు సినిమాలను ఓకే చేసేశారు. అంతేకాదు.. మరో రెండు సినిమాలను ట్రాక్ ఎక్కించడానికి సిద్ధమవుతున్నారు. కాగా.. ప్రస్తుతం ‘పింక్’ రీమేక్ చిత్రీకరణలో పవన్ ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే సినిమాకు సంబంధించి ఇంతవరకూ అరకొర అప్డేట్స్ తప్ప.. మెగాభిమానులు, ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు పండుగ చేసుకునేంతలా లేవ్. తాజాగా ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న థమన్ ట్రెండ్ సెట్ చేశాడు. ఇంతకీ అదేంటో చూద్దాం..!
ట్రెండ్ సెట్ చేస్తున్న థమన్!
థమన్ తన ట్విట్టర్ ప్రొఫైల్ పిక్‌ను మార్చి పవన్ కల్యాణ్ ఫొటోను పెట్టుకున్నారు. ‘లవ్ యూ ఆల్.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొత్త సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేస్తుంది’ అంటూ ఆయన ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. నేను పవన్‌కు వీరాభిమానిని. ఫస్ట్‌సింగిల్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నా. ఈ సినిమా కోసం సినిమా బృందం మొత్తం ఎంతో కష్టపడి పనిచేస్తోంది. ఇది మాకే కాకుండా అందరికీ ఎంత ముఖ్యమో బాగా తెలుసు. ఉత్తమ సంగీతాన్ని అందించేందుకు కృషి చేస్తున్నాను’ అని ట్వీట్‌లో తెలిపారు. ఈ సందర్భంగా.. #PSPK26FirstSingle అనే హ్యాష్‌ట్యాగ్‌ను సెట్ చేయడంతో.. అది ప్రస్తుతంలో ఇండియాలో ట్రెండింగ్‌తో దూసుకెళ్లిపోతోంది. కాగా.. ఈ ట్యాగ్‌ను ట్విట్టర్‌లో పెద్దఎత్తున ట్రెండ్ చేస్తున్నారు పవన్ వీరాభిమానులు. మొత్తానికి చూస్తే పవన్ వీరాభిమానులు, జనసేన కార్యకర్తలు కాసింత అసంతృప్తి నుంచి బయటికొచ్చి సంతోషించదగ్గ విషయాన్ని థమన్ చెప్పారనుకోవచ్చు. మొత్తానికి చూస్తే థమన్ ట్రెండ్ సెట్ చేస్తున్నారన్న మాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments