ఒసేయ్ రాములమ్మ సినిమాని గుర్తుచేసిన బాలకృష్ణ - థమన్‌ల జై బాలయ్య
Send us your feedback to audioarticles@vaarta.com
ఇదిలావుండగా... గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతోన్న వీర సింహారెడ్డికి థమన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, ఫస్ట్ లుక్, టీజర్లకు మంచి స్పందన రావడంతో వీరసింహారెడ్డిపై ఇండస్ట్రీలో మంచి అంచనాలున్నాయి. అలాగే పాటల కోసం కూడా ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. దీనిలో భాగంగా వీరసింహారెడ్డి నుంచి ఫస్ట్ సింగ్ రిలీజ్ చేసి అభిమానులకు ట్రీట్ ఇచ్చారు మేకర్స్. ‘‘జై బాలయ్య.. జై జై బాలయ్య ’’ అంటూ సాగే ఈ పాట ఫ్యాన్స్‌కి జోష్ ఇచ్చింది. కానీ.. ఈ పాటపై కూడా థమన్ కాపీ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.
ఒసేయ్ రాములమ్మ టైటిల్ సాంగ్ లేపేసిన థమన్:
తెలుగు హిట్ మూవీలోంచి ఈ ట్యూన్‌ను థమన్ లేపేశాడంటూ ఆధారాలతో సహా ట్రోల్ చేస్తున్నారు. అన్నట్లు ఆ హిట్ మూవీ ఏదో కాదు. దర్శకరత్న దాసరి నారాయణ రావు దర్శకత్వంలో లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి నటించిన ‘‘ఒసేయ్ రాములమ్మ’’ సినిమాలోని టైటిల్ సాంగ్. దానిని మక్కీకి మక్కీ దింపేశాడు థమన్. దీంతో ఈ పాట కాపీ ఇష్యూ ప్రస్తుతం టాలీవుడ్లో చర్చనీయాంశమైంది. అన్నట్లు లిరికల్ వీడియోలో థమన్ మరింత హుషారుగా కనిపించారు. లుక్, గెటప్ మార్చేశాడు. వైట్ షర్ట్, బంగారం వేసుకుని కనిపించాడు. గెటప్‌లో కొత్తగా కనిపించాలనే శ్రద్ధ.. ట్యూన్ కట్టేటప్పుడు ఏమైందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. జై బాలయ్య పాటతో నందమూరి హార్డ్ కోర్ ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చిన థమన్.. ట్రోలర్స్ నుంచి మాత్రం తప్పించుకోలేకపోయాడు. మరి రాబోయే సాంగ్లతోనైనా థమన్ జాగ్రత్త పడతాడో లేదంటే మళ్లీ కాపీ పేస్ట్‌లే చేస్తాడో చూడాలి.
80 శాతం పూర్తయిన వీరసింహారెడ్డి షూటింగ్:
ఇకపోతే.. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై రూపొందుతున్న వీ సింహారెడ్డిలో బాలయ్య సరసన శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ 80 శాతానికి పైగా పూర్తయ్యింది. ఈ మూవీలో హానీ రోజ్, వరలక్ష్మీ శరత్ కుమార్, నవీన్ చంద్ర, మురళీ శర్మ, ఈశ్వరీ రావులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక కన్నడ నటుడు దునియా విజయ్ ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments