SS Thaman:"గుంటూరు కారం’"పై రూమర్స్ : మజ్జిగ స్టాల్ పెట్టా .. ‘‘కడుపు మంట’’గా వుంటే రావొచ్చు , గట్టిగా ఇచ్చిన థమన్
Send us your feedback to audioarticles@vaarta.com
తమకు ఇష్టం లేని వ్యక్తులపై దుష్ప్రచారం చేసేందుకు సోషల్ మీడియాను వాడుకుంటున్నారు కొందరు. ఆ వార్త వాస్తవమో, అవాస్తవమో కానీ.. వీటి వల్ల పలువురి వ్యక్తిగత ప్రతిష్టకు డ్యామేజ్ జరుగుతోంది. సంబంధిత వ్యక్తులు స్వయంగా వివరణ ఇచ్చుకోవాల్సి వస్తోంది. ఇలాంటి వారికి బాధితుడిగా మారారు మ్యూజిక్ డైరెక్టర్ థమన్. ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వెలుగొందుతున్నారు థమన్. చిన్నా, పెద్దా అందరు హీరోలకు తమనే కావాలి. దీంతో ఆయన బిజీగా మారిపోతున్నారు. పళ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు తగులుతాయన్నట్లుగా.. సహజంగానే ఎదుగుతున్న వాడిపై పడి ఏడ్చేవాళ్లు ఎప్పుడూ వుంటారు.
గుంటూరు కారం నుంచి థమన్ తప్పుకున్నాడంటూ వార్తలు :
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న ‘‘గుంటూరు కారం’’ చిత్రానికి థమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయ్యేలా అదిరిపోయే మ్యూజిక్ అందిస్తున్నారు థమన్. రీసెంట్గా వచ్చిన ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్‌కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్ధితుల్లో థమన్ గుంటూరు కారం నుంచి తప్పుకున్నారంటూ సోషల్ మీడియాలో రూమర్లు పుట్టుకొచ్చాయి. మహేశ్ బాబుతో విభేదాలు వచ్చాయని కొందరంటే, థమన్ మ్యూజిక్ వర్క్ సూపర్‌స్టార్‌ను అంతగా ఇంప్రెస్ చేయలేదని అందుకే ఆయనను తప్పించారని మరో వార్త హల్ చల్ చేశాయి. ఇవి సినీ వర్గాల్లో కలకలం రేపాయి.
కడుపు మండితే అరటి పళ్లు కూడా తినొచ్చు :
విషయం పెద్దదవుతున్న నేపథ్యంలో థమన్ ఘాటుగా స్పందించారు. ట్విట్టర్లో మజ్జిగతో వున్న గ్లాస్ షేర్ చేసిన ఆయన.. ‘‘రేపటి నుంచి మా స్టూడియోలో బట్టర్ మిల్క్ స్టాల్ ఏర్పాటు చేస్తున్నానని, ఉచితంగా పంపిణీ చేస్తానని , ఎవరికైనా కడుపు మంట వుంటే వచ్చి తాగండి.. నాకు చాలా పని వుంది, టైమ్ వేస్ట్ చేయాలనుకోవడం లేదు, మీరు కూడా వృథా చేసుకోవద్దు, అలాగే అరటిపళ్లు కూడా కడుపు మంటకు బాగా పనిచేస్తాయ్ ’’ అని సెటైరికల్‌గా ట్వీట్ చేశారు. అంతేకాదు.. తాను మహేశ్ సినిమా నుంచి తప్పుకోలేదని క్లారిటీ కూడా తమన్ ఇచ్చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments