Music Director Raj:టాలీవుడ్లో మరో విషాదం : సంగీత దర్శకుడు రాజ్ కన్నుమూత, కోటితో కలిసి 150 సినిమాలకు బాణీలు
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ కన్నుమూశారు. ఆదివారం గుండెపోటుతో ఆయన తన నివాసంలో కన్నుమూశారు. 90వ దశకంలో తెలుగు ప్రేక్షకులను అలరించిన రాజ్ కోటి ద్వయం గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. రాజ్‌కు భార్య, ముగ్గురు కుమార్తెలు వున్నారు. రాజ్ అసలు పేరు తోటకూర సోమరాజు. ఆయన మరణవార్త గురించి తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు రాజ్ కుటుంబ సభ్యులకు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు. ఇక రాజ్ కోటి ద్వయం దాదాపు 150కి పైగా సినిమాలకు స్వరాలు సమకూర్చింది. అయితే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడివిడిగా పనిచేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే రాజ్.. సిసింద్రీ, రాముడొచ్చాడు, ప్రేమంటే ఇదేరా (బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్) తదితర సినిమాలకు పనిచేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments