Music Director Raj:టాలీవుడ్‌లో మరో విషాదం : సంగీత దర్శకుడు రాజ్ కన్నుమూత, కోటితో కలిసి 150 సినిమాలకు బాణీలు

  • IndiaGlitz, [Monday,May 22 2023]

తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ కన్నుమూశారు. ఆదివారం గుండెపోటుతో ఆయన తన నివాసంలో కన్నుమూశారు. 90వ దశకంలో తెలుగు ప్రేక్షకులను అలరించిన రాజ్ కోటి ద్వయం గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. రాజ్‌కు భార్య, ముగ్గురు కుమార్తెలు వున్నారు. రాజ్ అసలు పేరు తోటకూర సోమరాజు. ఆయన మరణవార్త గురించి తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు రాజ్ కుటుంబ సభ్యులకు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు. ఇక రాజ్ కోటి ద్వయం దాదాపు 150కి పైగా సినిమాలకు స్వరాలు సమకూర్చింది. అయితే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడివిడిగా పనిచేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే రాజ్.. సిసింద్రీ, రాముడొచ్చాడు, ప్రేమంటే ఇదేరా (బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్) తదితర సినిమాలకు పనిచేశారు.

More News

Vimanam:ఎమోష‌న‌ల్ జ‌ర్నీగా రూపొందిన ‘విమానం’ మూవీ నుంచి మే 22న ‘సుమతి’ లిరికల్ సాంగ్ రిలీజ్

జూన్ 9న గ్రాండ్ రిలీజ్ అవుతోన్న చిత్రం.. సముద్ర ఖని, మాస్టర్ ధ్రువన్, అనసూయ, రాజేంద్రన్, ధన్‌రాజ్ కీల‌క పాత్ర‌ధారులు

2000 Rupees:రూ.2000 నోట్ల ఉపసంహరణ : మార్పిడి ఎలా, రుసుము చెల్లించాలా .. మీ మైండ్‌లోని డౌట్స్‌కి ఆన్సర్స్ ఇవే..?

రూ. 2000 నోట్లను చెలమణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించిన నేపథ్యంలో

Bichagadu:అప్పుడు రూ.500, రూ.1000 ... ఇప్పుడు రూ.2 వేలు, ‘‘బిచ్చగాడు’’ వచ్చినప్పుడల్లా నోట్ల రద్దే ..!!

దేశంలో రూ.2000 నోట్ల చెలామణిని ఉపసంహరించుకుంటున్నట్లుగా భారత రిజర్వ్ బ్యాంక్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Dead Pixels:'డిస్నీ ప్లస్ హాట్ స్టార్' స్పెషల్ 'డెడ్ పిక్సల్స్'

'డిస్నీ ప్లస్ హాట్ స్టార్" స్పెషల్స్ పరంపరలో వచ్చిన సరికొత్త సిరీస్ "డెడ్ పిక్సల్స్". కాస్త డార్క్ హ్యూమర్ టచ్ తో సిట్యుయేషనల్ కామెడీ దీని స్పెషాలిటీ.

2000 Notes:రిజర్వ్ బ్యాంక్ సంచలన నిర్ణయం.. రూ.2 వేల నోటు ఉపసంహరణ , మార్చుకోవడానికి గడువు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. రూ. 2 వేల నోట్లను చెలామణీ నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది.