చరణ్ , సుక్కు సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా...
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాపవర్ స్టార్ రాంచరణ్ ఇప్పుడు ధృవ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. సినిమా మూడో షెడ్యూల్ చిత్రీకరణను స్టార్ట్ చేసుకోనుంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 30న విడుదల చేయనున్నారు. ఈ సినిమా తర్వాత చరణ్ సుకుమార్ దర్శకత్వంలో ఓ థ్రిల్లర్ మూవీ చేయబోతున్నాడని వార్తలు వినిపించాయి. ఈ సినిమాలో చరణ్ డాక్టరుగా కనిపిస్తాడని అంటున్నారు.
ప్రస్తుతం సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించనున్నాడు. సాధారణంగా సుకుమార్ తన సినిమాలకు దేవిశ్రీప్రసాద్ తోనే సంగతం చేయించుకుంటాడు. అదేవిధంగా ఈ సినిమాకు కూడా సుకుమార్ దేవిశ్రీతోనే మ్యూజిక్ చేయించుకుంటున్నాడని సమాచారం. ఈ సినిమాకు ఫార్ములా ఎక్స్ అనే టైటిల్ ఫిక్స్ చేశారనే పేరు గట్టిగా వినపడుతుంది. ఈ సైంటిఫిక్ థ్రిల్లర్ చిత్ర నిర్మాణానికి దాదాపు డెబ్బై కోట్లు ఖర్చు అయ్యేలా ఉందని అంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com