'పిట్టగోడ' వంటి డిఫరెంట్ ఎంటర్ టైనర్ కు మ్యూజిక్ చేయడం హ్యాపీ - ప్రాణం కమలాకర్

  • IndiaGlitz, [Sunday,December 18 2016]

విశ్వదేవ్‌ రాచకొండ, పునర్నవి హీరోహీరోయిన్లుగా స్టార్‌ ప్రొడ్యూసర్‌ డి.సురేష్‌బాబు సమర్పణలో సురేష్‌ ప్రొడక్షన్స్‌, సన్‌షైన్‌ సినిమాస్‌ పతాకాలపై అనుదీప్‌ కె.వి. దర్శకత్వంలో దినేష్‌కుమార్‌, రామ్మోహన్‌ పి. నిర్మించిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం 'పిట్టగోడ'. ఈ సినిమా డిసెంబ‌ర్ 24న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర సంగీత ద‌ర్శ‌కుడు ప్రాణం కమలాకర్ ఆదివారం పాత్రికేయుల‌తో సినిమా సంగ‌తుల‌ను ముచ్చ‌టించారు...

ఒక‌రోజులు నిర్మాత రామ్మోహ‌న్‌గారు ఫోన్ చేసి పిట్ట‌గోడ సినిమాకు సంగీతం అందించాల‌ని నన్ను కోరారు. అయితే నేను అవున‌ని కానీ, కాద‌ని కాని రెస్పాండ్ కాలేదు. అయితే అప్ప‌టికే సాంగ్స్‌కు సంబంధించిన మాంటేజ‌స్ షూట్ చేసేసి ఉండ‌టంతో రామ్మోహ‌న్‌గారు నాకు ఫోన్ చేసి పాట‌లు విని అవి న‌చ్చితేనే సినిమాకు సంగీతం అందిచ‌మ‌ని అన్నారు. నేను మాంటేజ్ సాంగ్స్ చూశాను. సినిమాలో మంచి మ్యూజిక్‌కు స్కోప్ ఉండ‌టంతో సినిమాకు సంగీతం అందించ‌డానికి ఒప్పుకున్నాను.

నేను సినిమాలకు సంగీతం అందించ‌డం మాన‌లేదు, మానేయాల‌నుకోలేదు. నేను దాదాపు ముప్పై ఏళ్లుగా ఆర్‌.డి.బ‌ర్మ‌న్ నుండి ఎ.ఆర్‌.రెహ‌మాన్‌ల‌తో వ‌ర్క్ చేశాను. ఇప్పుడు రెహ‌మాన్ సంగీతం అందిస్తున్న 2.0 సినిమా మ్యూజిక్ గ్రూప్‌లో కూడా వ‌ర్క్ చేస్తున్నాను. ఇలా మంచి అనుభ‌వ‌మున్న‌వారితో వ‌ర్క్ చేస్తుండ‌టం వల్ల నేను సంగీతం అందించే సినిమాలు త‌గ్గిపోయాయి.

సాధార‌ణంగా ఇప్పుడు కొన్ని సినిమాలకు కొంత మంది సంగీతం అందిస్తే, మ‌రి కొంద‌రు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. అయితే అలా చేయ‌డం నాకు ప‌ర్స‌న‌ల్‌గా ఇష్టం ఉండ‌దు. ఇక పిట్ట‌గోడ సినిమాకు సంగీతం, నేప‌థ్య సంగీతం రెండూ నేనే అందించాను. ఈ సినిమాలో మొద‌టి సాంగ్ తెలంగాణ యాస‌లో ఉంటుంది. తీయ తీయ‌ని...పాట‌, జ‌రిగెనే సాంగ్ ఇలా సాంగ్స్ అన్నీ నాకు ఇష్ట‌మైన‌వే. పిట్ట‌గోడ వంటి డిఫ‌రెంట్ ఎంట‌ర్‌టైన‌ర్‌కు మ్యూజిక్ చేయ‌డం హ్యాపీ.

మంచి టీంతో పనిచేశాను. విశ్వదేవ్‌ రాచకొండ, పునర్నవి, డైరెక్ట‌ర్ అనుదీప్‌, నిర్మాత రామ్మోహ‌న్ ఇలా మంచి ఆర్టిస్టులు, టెక్నిషియ‌న్స్ ఓ టీంగా ఏర్ప‌డి మంచి అవుట్‌పుట్‌తో సినిమాను చేశాం.

More News

సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో వస్తున్నాడు..!

సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి రమేష్ బాబు,మహేష్ బాబు,మంజుల,సుధీర్ బాబు...ఇండస్ట్రీకి వచ్చిన విషయం తెలిసిందే.

పరభాషా నటీనటులకు మనం స్వాగతం చెబుతాం.. వాళ్లు మాత్రం మనకి అవకాశాలు ఇవ్వరు.. కారణంఅదే..! రావు రమేష్

విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుని అనతికాలంలోనే సుస్ధిర స్ధానాన్ని సంపాదించుకున్న విలక్షణ నటుడు రావు రమేష్.

శ‌త‌మానం భ‌వ‌తి ఆడియో ఫంక్ష‌న్ కి ముఖ్య అతిధి మెగాస్టార్..!

ఉత్తమ కుటుంబకథా చిత్రాల నిర్మాతగా పేరున్న ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణం లో, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం శ‌త‌మానం భ‌వ‌తి. ఈ చిత్రంలో శ‌ర్వానంద్, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ జంట‌గా న‌టించారు.

ఈనెల 24న 'ఓం నమో వేంకటేశాయ' టీజర్

అక్కినేని నాగార్జున, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడి సాయి చిత్రాలు ప్రేక్షకుల్ని ఎంతగా ఆకట్టుకున్నాయో తెలిసిందే.

సంపూ 'వైరస్ ' షూటింగ్ పూర్తి....

హృదయలేయం,సింగం 123 వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సంపూర్ణేష్ బాబు హీరోగా పుల్లారేవు రామచందర్ రెడ్డి సమర్పణలో