బ‌న్ని సినిమాకు మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ....

  • IndiaGlitz, [Wednesday,February 27 2019]

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు వేగం పుంజుకుంటున్నాయి. డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ ఫుల్ ఎంట‌ర్‌టైనింగ్ పంథాలో సినిమా ఉండేలా స్క్రిప్ట్‌ను సిద్ధం చేసేస్తున్నాడు. త్వ‌ర‌లోనే స్క్రిప్ట్ ఫైనల్ వ‌ర్క్ కంప్లీట్ కానుంది. మ‌రో ప‌క్క ఇత‌ర ప‌నులు జ‌రుగుతున్నాయి. 'డీజే దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌' త‌ర్వాత బ‌న్నితో పూజా హెగ్డే మ‌రోసారి క‌లిసి న‌టించ‌నుంది.

అలాగే బాలీవుడ్ నటుడు బోమ‌న్ ఇరాని, నగ్మా కూడా ఈ చిత్రంలో న‌టిస్తార‌ని టాక్. లెటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ సినిమాకు థ‌మ‌న్ సంగీతాన్ని అందించ‌నున్నాడు. త్రివిక్ర‌మ్ గ‌త చిత్రం 'అర‌వింద స‌మేత‌' సినిమాకు థ‌మ‌న్ అందించిన సంగీతం కీ రోల్ తీసుకుంది. దాంతో ఇంప్రెస్ అయిన ఈ స్టార్ డైరెక్ట‌ర్ ఈ సినిమాకు కూడా థ‌మ‌న్‌నే కంటిన్యూ చేయాల‌నుకుంటున్నాడ‌ట‌. బ‌న్నికి కూడా ఈ విష‌యంలో పెద్ద ఇబ్బంది ఉండ‌దు కాబ‌ట్టి థ‌మ‌న్‌కు మ‌రో క్రేజీ ప్రాజెక్ట్ ద‌క్కేసిన‌ట్టేనని ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం.