డబుల్ ధమాకా ఇవ్వనున్న మ్యూజిక్ డైరెక్టర్
Send us your feedback to audioarticles@vaarta.com
‘అర్జున్ రెడ్డి’.. సంచలనానికి మారు పేరుగా నిలిచిన సినిమా. ఈ సినిమా తెలుగు సినీ పరిశ్రమకి సందీప్ రెడ్డి అనే కొత్త దర్శకుడిని, అలాగే హీరోయిన్ షాలిని పాండేను పరిచయం చేసింది. అంతేకాకుండా.. వీరితో పాటు హర్షవర్థన్ రామేశ్వర్ అనే కొత్త సంగీత దర్శకుడిని కూడా ఇంట్రడ్యూస్ చేసింది. హర్షవర్థన్ నేపథ్య సంగీతం అందించిన తొలి సినిమా విజయం సాధించడంతో.. సంగీత దర్శకుడిగా మరో రెండు సినిమాల్లో అవకాశం వచ్చింది. ఇప్పుడు ఆ రెండూ కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
ఆ వివరాల్లోకి వెళితే.. బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా నటించిన సినిమా ‘సాక్ష్యం’. శ్రీవాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి హర్షవర్థన్ రామేశ్వర్ సంగీతం అందించారు. ఇది జూలై 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇదే నెలలో తాను సంగీతం అందించిన మరో సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. అదే మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా తెరంగేట్రం చేస్తున్న సినిమా ‘విజేత’. మాళవికా నాయర్ నాయికగా నటించిన ఈ సినిమాకి రాకేశ్ శశి దర్శకత్వం వహించారు. ఈ రెండు సినిమాలతో వచ్చే నెలలో డబుల్ ధమాకా ఇవ్వనున్నారు ఈ మ్యూజిక్ డైరెక్టర్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com