పవన్ మూవీకి వర్క్ చేసే లక్కీ ఛాన్స్ దక్కించుకున్న మ్యూజిక్ డైరెక్టర్..!
Tuesday, November 8, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కాటమరాయుడు సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డాలీ దర్శకత్వంలో శరత్ మరార్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పవన్ చేయనున్న సినిమా ప్రారంభమైంది. ఈ సినిమా కంటే ముందు పవన్ - ఎ.ఎం.రత్నం నిర్మించే చిత్రం ప్రారంభించారు. ఈ చిత్రాన్ని ఆర్.టి.నేసన్ తెరకెక్కించనున్నారు.
తమిళ్ లో రూపొందిన వేదాళమ్ చిత్రానికి రీమేక్ గా ఈ చిత్రం రూపొందుతుంది అని సమాచారం. ఈ భారీ చిత్రానికి ఎస్.ఎస్.తమన్ సంగీతం అందించనున్నారు. ఈ విషయాన్ని తమన్ ట్విట్టర్ ద్వారా తెలియచేస్తూ...నా నెక్ట్స్ ఫిల్మ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు - నేసన్ - ఎ.ఎం.రత్నం కాంబినేషన్లో రూపొందే చిత్రం. ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండడం చాలా చాలా సంతోషంగా ఉంది అని తెలియచేసారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments