నాగ్ , నాని చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్
Send us your feedback to audioarticles@vaarta.com
కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని కథానాయకులుగా ఓ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరోవైపు.. నటీనటులను, సాంకేతిక బృందాన్ని ఎంపిక చేసే పనిలో పడింది చిత్రబృందం. ఈ కామెడీ ఎంటర్టైనర్ను ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. అశ్వినీదత్ ఆస్థాన సంగీత దర్శకుడిగా పేరు గాంచిన మణిశర్మను ఈ సినిమాకి కూడా సంగీత దర్శకుడిగా ఎంపిక చేసినట్టు తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి.
చూడాలని ఉంది, రాజకుమారుడు, ఇంద్ర.. ఇలా వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటికే ఎన్నో మ్యూజికల్ హిట్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ నెల 24నుండి చిత్రీకరణ మొదలు కానున్న ఈ చిత్రంలో నాగార్జున డాన్ పాత్రలో కనిపించనుండగా...నాని డాక్టర్ పాత్రలో నటించనున్నారు. ప్రస్తుతం నాగార్జున, రాంగోపాల్ వర్మ కలయికలోని సినిమా చిత్రీకరణ దశలో ఉండగా...నాని కథానాయకుడిగా మేర్లపాక గాంధి దర్శకత్వంలో రూపొందుతున్న కృష్ణార్జున యుద్ధం` చిత్రీకరణ చివరి దశలో ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com