ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి మరో అట్రాక్షన్: మ్యూజిక్ డైరెక్టర్ అతుల్ సాహసం.. బైక్‌పై ముంబై నుంచి తిరుపతికి

  • IndiaGlitz, [Saturday,June 03 2023]

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘‘ఆదిపురుష్’’. ఎన్నో అవాంతరాలు, ఆటుపోట్లను ఎదుర్కొన్న ఈ చిత్రం ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. గతంలో టీజర్ సందర్భంగా చోటు చేసుకున్న పొరపాట్లను చక్కదిద్దిన చిత్ర యూనిట్.. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. అలాగే పాటలు కూడా బాగున్నాయన్న రెస్పాన్స్ వచ్చింది. ఇక జూన్ 6న ఆదిపురుష్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. దీనిలో భాగంగా ఈ నెల 6న తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా చేయనున్నారు. భారతదేశ సినీ చరిత్రలో గతంలో ఎన్నడూ జరగని విధంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ముంబై నుంచి వందలాది మంది డ్యాన్సర్లు, సింగర్లు రానున్నారట. అంతేకాదు.. కనివినీ ఎరుగని రీతిలో బాణా సంచాను కూడా కాల్చనున్నారట. శ్రీరామ్ అనే శబ్ధం వచ్చేలా ఇవి వుంటాయని టాక్.

శ్రీవారి పాదాల వద్ద జై శ్రీరామ్ పాటను సమర్పించనున్న అతుల్ - అజయ్ :

ఇదిలావుండగా.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మరింత స్పెషల్‌గా మార్చేందుకు సిద్ధమయ్యారు ఈ చిత్ర సంగీత దర్శకుడు అతుల్. బైక్‌పై ముంబై నుంచి తిరుపతికి రానున్నారు. అతుల్ జూన్ 3న ముంబైలో బయలుదేరి జూన్ 5న తిరుపతికి చేరుకోనున్నారు. అనంతరం తన సోదరుడు అజయ్ తో కలిసి ఆ వెంకటేశ్వర స్వామి పాదాల వద్ద జైశ్రీరామ్ పాటను సమర్పించనున్నారు. వెంకటేశ్వర స్వామి, శ్రీ రాముడు కూడా ఆ విష్ణు మూర్తి అవతారాలే కాబట్టి ఆయన్ని దర్శించుకుని సినిమా బాగా ఆడాలని కోరుకోబోతున్నారు. సాధారణంగా, ఇలాంటి పనుల‌ను బైక్ రైడర్స్ చేస్తూ ఉంటారు. అయితే తొలిసారిగా ఓ మ్యూజిక్ డైరెక్టర్ సినిమాపై తనకున్న ప్రేమను చాటుకునేందుకు ఈ విధంగా ముంబై నుంచి తిరుపతికి బైక్ రైడ్ చేయబోతున్నాడు. ఇది కూడా ఆదిపురుష్ సినిమాకి కలిసొస్తుందని విశ్లేషకులు అంటున్నారు.

ఇకపోతే.. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్‌తో ఆదిపురుష్‌ను తెరకెక్కిస్తున్నారు. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, రావణుడిగా సైఫ్ అలీఖాన్, లక్ష్మణుడిగా సన్నీసింగ్, హనుమంతుడిగా దేవదత్త నాగే నటిస్తున్నారు. వీరితో పాటు వత్సల్ సేథ్, సోనాల్ చౌహాన్, తృప్తి తోరడమల్ కీలక పాత్రలు షోషిస్తున్నారు. టీ-సిరీస్‌, రెట్రో ఫైల్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

More News

చరిత్ర సృష్టించిన మోడీ : యూఎస్ కాంగ్రెస్ ఆహ్వానం .. చర్చిల్, మండేలా తర్వాత ఆ ఘనత

అంతర్జాతీయంగా తన పలుకుబడిని పెంచుకోవడమే కాకుండా ఆయా దేశాలతో భారతదేశానికి కూడా సంబంధాలు మెరుగుపరుస్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. గడిచిన 9 ఏళ్ల కాలంలో భారత దౌత్య విధానం పూర్తిగా మారిపోయింది.

Travel Insurance: 0.45 పైసలతో రూ.10 లక్షల ప్రమాద బీమా.. టికెట్ బుక్ చేసేటప్పుడు ఈ ఆప్షన్ స్కిప్ చేస్తున్నారా..?

ఒడిషాలోని బాలేశ్వర్ జిల్లా బహనాగ్ బజార్ రైల్వే స్టేషన్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో దాదాపు 270 మంది మరణించడంతో యావత్ దేశం దిగ్భ్రాంతికి గురైంది.

Pawan Kalyan: ఒడిషా రైలు ప్రమాదం.. ఇకనైనా భద్రతా చర్యలు తీసుకోండి : కేంద్రానికి పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో దాదాపు 270 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. 900 మందికి పైగా గాయపడ్డారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం వుందని

Odisha Train Accident: ఒడిషా రైలు ప్రమాదం : రెండు రైళ్లలో 120 మంది ఏపీ వాసులు..

ఒడిషాలోని బాలేశ్వర్ జిల్లా బహనాగ్ బజార్ రైల్వే స్టేషన్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో దాదాపు 270 మంది మరణించడంతో దేశం దిగ్భ్రాంతికి గురైంది.

Odisha Train Accident: మాటలకందని మహా విషాదం: ఒడిషాకు మోడీ.. ప్రమాదస్థలిని పరిశీలించనున్న ప్రధాని

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో దాదాపు 270 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. 900 మందికి పైగా గాయపడ్డారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం వుందని..