ఏఆర్ రెహమాన్ ఇంట్లో పెళ్లి భాజాలు… పెళ్లీపీటలెక్కనున్న పెద్ద కుమార్తె, వరుడు ఎవరంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
భారతదేశం గర్వించదగ్గ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ ఇంట్లో పెళ్లి భాజాలు మోగాయి. ఆయన కుమార్తె ఖతీజా రెహమాన్ నిశ్చితార్థం గత నెల 29న ఘనంగా జరిగింది. ఈ విషయాన్ని ఖతీజా స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తనకు కాబోయే భర్తను రియాసిద్దీన్ షేక్ మహ్మద్‌గా పరిచయం చేశారు. ఆయన ఒక పారిశ్రామిక వేత్త అని చెప్పింది.
అయితే ఇంకా వీరి పెళ్లి తేదీ ఖరారు కాలేదని సమాచారం. అలాగే వీరిద్దరిది ప్రేమ వివాహమా లేక పెద్దలు కుదిర్చిన పెళ్లా అన్నది కూడా తెలియరాలేదు. ఎంగేజ్‌మెంట్ వేడుకకి కూడా కేవలం కుటుంబసభ్యులు, బంధువులు మాత్రమే హాజరయ్యారు. అందుకే వీరి ఫోటోలు కూడా బయటికి రాలేదు. యాదృచ్ఛికంగా ఖతీజా తన పుట్టినరోజునే రియాస్దీన్‌తో నిశ్చితార్థం జరుపుకోవడం విశేషం. కాగా ఏఆర్ రెహ్మాన్ కు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. వారిలో ఖతీజా పెద్ద కుమార్తె కాగా... చిన్నకూతురు పేరు రహీమా, కొడుకు అమీన్ రెహ్మాన్.
ఇకపోతే.. ఖతీజా కూడా మంచి గాయనే. రజనీకాంత్ హీరోగా వచ్చిన రోబోలో ‘ఓ మరమనిషి’ పాటను ఈమెనే పాడింది. 14 ఏళ్ల వయసులోనే ఆమె ఈ పాట పాడారు. ఆ పాటను తమిళ, తెలుగు భాషల్లో కూడా ఖతీజానే ఆలపించారు. ఆమె ‘ఫరిష్టోన్’ అనే మ్యూజిక్ ఆల్బమ్‌ను కూడా విడుదల చేసింది. ఇది ఉత్తమ యానిమేషన్ మ్యూజిక్ వీడియోగా గుర్తింపు పొందింది. 2020లో బురఖా ఊపిరాడకుండా వేసుకున్న కారణంగా ఖతీజా వివాదంలో చిక్కుకుంది. అయితే ఈ వివాదంపై ఖతీజా పరిణతితో స్పందించారు. తనకు నచ్చినవి వేసుకోవడం తన ఇష్టమని చెప్పి విమర్శలకు చెక్ పెట్టింది. అలాగే రెహ్మాన్ చిన్న కూతురు రహీమా బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టుగా సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com