చిరంజీవి 152వ చిత్రానికి సంగీత దర్శకుడు అతనే ?

  • IndiaGlitz, [Wednesday,November 20 2019]

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్తి కానున్నాయి. డిసెంబ‌ర్‌లో ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఈ సినిమాకు సంగీత ద‌ర్శ‌కుడిగా మ‌ణిశ‌ర్మ‌ను తీసుకోవాల‌ని చిరంజీవి భావిస్తున్నాడ‌ట‌. ఎందుకంటే ఇన్నాళ్లు పామ్‌లో లేని మ‌ణిశ‌ర్మ 'ఇస్మార్ట్ శంక‌ర్‌'తో ఫామ్‌లోకి వ‌చ్చాడు. చిరంజీవి మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ప‌రిచయం చేసిన మ‌ణిశ‌ర్మ, చిరంజీవి న‌టించిన ప‌లు చిత్రాల‌కు అద్భుత‌మైన సంగీతాన్ని అందించారు. మ‌ధ్య‌లో దేవిశ్రీ ప్ర‌సాద్‌, త‌మ‌న్ దూసుకు రావ‌డంతో పాటు మ‌ణిశ‌ర్మ క‌నుమ‌రుగ‌య్యాడు. ఇంత‌కు ముందు ఈ చిత్రానికి అజ‌య్ అతుల్ పేర్లు సంగీత ద‌ర్శ‌కులుగా పేర్లు విన‌ప‌డ్డాయి. కానీ చివ‌ర‌కు వారిద్ద‌రూ నో చెప్పిసిన‌ట్లు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం.

ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి, రామ్‌చ‌ర‌ణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి బ‌యోపిక్ 'సైరా న‌రసింహారెడ్డి' విడుద‌లై మంచి టాక్‌ను సంపాదించుకుంది. అంత‌కు ముందు చిరంజీవి 'ఖైదీ నంబ‌ర్ 150' సినిమాతో బ్లాక్‌బ‌స్ట‌ర్‌ను సాధించాడు. ఇప్పుడు మెసేజ్ ఓరియెంటెడ్ క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌ను తెర‌కెక్కించడంలో దిట్ట అయిన కొరటాల శివ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండ‌టంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇందులో త్రిష హీరోయిన్‌గా న‌టిస్తుంద‌ని టాక్‌.

More News

RRR: ఎన్టీఆర్ అభిమానుల‌కు గుడ్‌న్యూస్‌

ఎన్టీఆర్ అభిమానుల‌కు గుడ్‌న్యూస్‌. ఎందుకంటే ఆయ‌న `RRR` సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

డైరెక్టర్ సురేందర్ రెడ్డి చేతుల మీదుగా 'మిస్ మ్యాచ్' ట్రైలర్ విడుదల

'అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి' సంస్థ తమ తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్న చిత్రం  'మిస్ మ్యాచ్'.

హీరో నాని ఇంటిపై ఐటీ దాడులు

టాలీవుడ్‌‌పై ‘ఐ’టీ ఓ కన్నేసింది.. ఇవాళ ప్రముఖ రామానాయుడు స్టూడియో, నిర్మాత దగ్గుబాటి సురేశ్‌బాబుకు చెందిన ప్రొడక్షన్ హౌస్‌కు సంబంధించిన కార్యాలయాలు,

రామానాయుడు స్టూడియోపై ‘ఐ’టీ సోదాలు.. జంకుతున్న నిర్మాతలు!

టాలీవుడ్‌ టాప్ స్టూడియో అయిన రామానాయుడు స్టూడియో, ప్రముఖ చలనచిత్ర నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్‌కు సంబంధించిన కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు.

కదులుతున్న బస్సులోంచి విద్యార్థినిని తోసేసిన కండక్టర్

స్టూడెంట్ పాస్ చెల్లదంటూ కదులుతున్న బస్సులో నుంచి విద్యార్థినిని కండక్టర్ కిందికి తోసేశాడు. ఈ ఘటనలో విద్యార్థినికి తలకు తీవ్ర గాయమవ్వగా..