చిరంజీవి 152వ చిత్రానికి సంగీత దర్శకుడు అతనే ?
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కానున్నాయి. డిసెంబర్‌లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. లేటెస్ట్ సమాచారం మేరకు ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా మణిశర్మను తీసుకోవాలని చిరంజీవి భావిస్తున్నాడట. ఎందుకంటే ఇన్నాళ్లు పామ్‌లో లేని మణిశర్మ `ఇస్మార్ట్ శంకర్`తో ఫామ్‌లోకి వచ్చాడు. చిరంజీవి మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిచయం చేసిన మణిశర్మ, చిరంజీవి నటించిన పలు చిత్రాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. మధ్యలో దేవిశ్రీ ప్రసాద్, తమన్ దూసుకు రావడంతో పాటు మణిశర్మ కనుమరుగయ్యాడు. ఇంతకు ముందు ఈ చిత్రానికి అజయ్ అతుల్ పేర్లు సంగీత దర్శకులుగా పేర్లు వినపడ్డాయి. కానీ చివరకు వారిద్దరూ నో చెప్పిసినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ `సైరా నరసింహారెడ్డి` విడుదలై మంచి టాక్‌ను సంపాదించుకుంది. అంతకు ముందు చిరంజీవి `ఖైదీ నంబర్ 150` సినిమాతో బ్లాక్‌బస్టర్‌ను సాధించాడు. ఇప్పుడు మెసేజ్ ఓరియెంటెడ్ కమర్షియల్ చిత్రాలను తెరకెక్కించడంలో దిట్ట అయిన కొరటాల శివ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో త్రిష హీరోయిన్‌గా నటిస్తుందని టాక్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments