ఎన్టీఆర్ దగ్గరకి కథతో వెళ్తోన్న దర్శకుడు...
Send us your feedback to audioarticles@vaarta.com
'టెంపర్' చిత్రంతో సక్సెస్ అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. వెంకటేశ్వర సినీ చిత్ర క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ చిత్రాన్ని బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం సినిమా లండన్ చిత్రీకరణ జరుపుకుంటోంది.
ఈ సినిమా తర్వాత గోపిచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు ఎ.ఆర్.మురగదాస్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని దిల్ రాజు, మురగదాస్ లు నిర్మిస్తున్నారు. ముందు లైన్ విన్న ఎన్టీఆర్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పుడు ఎ.ఆర్.మురగదాస్, గోపిచంద్ మలినేనిలు పూర్తి స్క్రిప్ట్ తో ఎన్టీఆర్ ను కలవడానికి లండన్ వెళ్లారట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com