నయన్ విమర్శలకు 14 ఏళ్ల తర్వాత స్పందించిన మురుగదాస్

  • IndiaGlitz, [Wednesday,January 01 2020]

ఎక్స్ పిచ్చి.. వై పిచ్చి అంటూ ‘గజిని’ సినిమాలో ఆడిపాడి.. కుర్రకారును హుషారెత్తించిన భామ నయనతార. ఆ సినిమా తర్వాత ఆమె వెనుదిరిగి చూసుకోనవసరం లేకుండా పోయింది. పోరగాళ్ల హృదయాల్లో గూడు కట్టేసుకుందన్న చందాన.. దక్షిణాదిన టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. 2005లో విడుదలైన ఈ సినిమాను ఏఆర్ మురుగదాస్‌ డైరెక్ట్ చేశాడు. సూర్య, అసిన్ జంటగా నటించగా.. నయన్ కీలకపాత్ర పోషించింది. అయితే అప్పట్లో మురుగదాస్‌పై ఆమె తీవ్ర విమర్శలు చేసింది. దర్శకుడు తన పాత్ర నిడివి తగ్గించి చూపాడని.. కథ చెప్పిన దానికి, తర్వాత తీసిన దానికి చాలా తేడా ఉందని విమర్శించింది. అంతేగాక ఫొటోగ్రఫీ కూడా సరిగ్గా లేదని ఆరోపించింది. ఈ సినిమాను ఒప్పుకోవడం చెత్త నిర్ణయంగా అభివర్ణించింది.

దీనిపై మురుగదాస్ తాజాగా స్పందించారు. కథకు తగ్గట్టుగా తాను నటీనటులను ఎంపిక చేసుకుంటానని.. దీనిలో తన ఇష్టాయిష్టాలకు తావుండదని పేర్కొన్నాడు. కథ డిమాండ్ మేరకు మాత్రమే నడుచుకుంటానని స్పష్టం చేశారు. ఓ వ్యక్తి నచ్చాడనో.. లేదా పాత్ర నచ్చిందనో దాని నిడివి పెంచడం.. తగ్గించడం ఉండదన్నారు. ఒక్కోసారి నచ్చనివాళ్లకు ఎక్కువ నిడివి ఇవ్వాల్సి వస్తుందని.. మరోసారి నచ్చినవాళ్లకు చిన్న చిన్న పాత్రలే ఇవ్వాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు.

వచ్చే నెల 9న ప్రేక్షకుల ముందుకు రానున్న సూపర్ రజినీ సినిమా దర్బార్‌లో నయన్ నటించింది. మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.

More News

'అన్నపూర్ణమ్మ గారి మనవడు' సెన్సార్ పూర్తి

అమరావతి రాజధానిలో వైకుంటపురం అనే అందమైన గ్రామంలో నిర్మించిన చిత్రమే "అన్నపూర్ణమ్మ గారి మనవడు"

మరో క్యాచీ పదం.. సరిలేరు నీకెవ్వరు‌లో వినిపించబోతోంది!

కొత్త పదాలను సృష్టించి.. వాటిని సినీ జనాల నోళ్లలో నానేలా చేయడంలో టాలీవుడ్ డైరెక్టర్లు ముందుంటారు.

సౌత్ హీరోలపై నోరు పారేసుకున్న నేహా ధుపియా

నేహా ధూపియా.. అందంతో పాటు వివాదాలతో సావాసం చేసే బాలీవుడ్ హీరోయిన్లలో టాప్ లిస్టులో ఉంటుంది. కెరీర్ తొలినాళ్లలో సౌత్ సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ.. తర్వాత బాలీవుడ్‌‌కి షిఫ్ట్ అయిపోయింది.

2019 నేషనల్ రౌండప్.. లాస్ట్‌ పంచ్‌ కాంగ్రెస్‌దే!!

2019కు గుడ్ బై చెప్పేసి మరికొన్ని గంటల్లోనే కోటి ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం.

2019 ఏపీ రౌండప్.. ప్రధాన ఘట్టాలివీ..

2019కు గుడ్ బై చెప్పేసి మరికొన్ని గంటల్లోనే కోటి ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ క్రమంలో 2020కు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పడానికి యూత్ అంతా సిద్ధమైపోయారు.