మురుగుదాస్ మూవీకి మహేష్ సెంటిమెంట్..
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్రహ్మోత్సవం అంచనాలను అందుకోలేకపోవడంతో... ప్రస్తుతం మహేష్ దృష్టి అంతా మురుగుదాస్ మూవీ పైనే ఉందట. దాదాపు 80 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్ లో రూపొందించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని త్వరలో ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో మురుగుదాస్ స్టైల్ లో స్ట్రాంగ్ సోషల్ మెసేజ్ ఉంటుందని సమాచారం. ఇదిలా ఉంటే...బ్రహ్మోత్సవం నిరాశపరచడంతో మహేష్ మురుగుదాస్ మూవీ పై చాలా కేర్ తీసుకుంటున్నాడట. త్వరలో షూటింగ్ ప్రారంభించే ఈ చిత్రాన్ని డిసెంబర్ కి పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
అయితే...డిసెంబర్ కి షూటింగ్ పూర్తయినా ఈ చిత్రాన్ని మాత్రం వచ్చే సమ్మర్ లో రిలీజ్ చేయాలనుకుంటున్నారట. మే నెలలో రిలీజైన మహేష్ చిత్రాలు నిజం, నాని, బ్రహ్మోత్సవం అంచనాలను రీచ్ కాలేకపోయాయి. దీంతో నెక్ట్స్ మూవీని ఏప్రిల్ లో రిలీజ్ చేయాలనుకుంటున్నారట. అదీ కూడా పోకిరి రిలీజ్ డేట్ ఏప్రిల్ 28న రిలీజ్ చేయాలనుకుంటున్నట్టు సమాచారం. సక్సెస్ కోసం సెంటిమెంట్ ఫాలో అవ్వాలనుకుంటున్న మహేష్ మురుగుదాస్ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేస్తాడని ఆశిద్దాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments