మహేష్ తో మురుగుదాస్ లేటెస్ట్ అప్ డేట్స్...
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్... సెన్సేషనల్ డైరెక్టర్ మురుగుదాస్ వీరిద్దరు కలసి ఓ సినిమా చేయనున్నారని గత కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. మురుగుదాస్ తో సినిమా గురించి మహేష్ ని అడిగితే...ఇటీవల మురుగుదాస్ ని కలిసాను. లైన్ చెప్పారు. త్వరలో ఇద్దరం కలసి సినిమా చేయనున్నాం అని కూడా ప్రకటించారు. అయితే ఈ సినిమా గురించి మాకు అందిన లేటెస్ట్ అప్ డేట్ ఏమిటంటే...
మహేష్, మురుగుదాస్ ల క్రేజీ కాంబినేషన్ లో రూపొందే సినిమాని నిర్మించే ఛాన్స్ దిల్ రాజు దక్కించుకున్నాడట. ఈ సినిమాని తెలుగు, తమిళ భాషల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం మురుగుదాస్ మహేష్ ని సరికొత్తగా చూపించేలా పకడ్బంది కథను సిద్దం చేసే పనిలో బిజీగా ఉన్నాడట. మరో విశేషం ఏమిటంటే...దిల్ రాజుతో పాటు మురుగుదాస్ కూడా నిర్మాణంలో పాలు పంచుకుంటాడట. కొత్త కాన్సెప్ట్స్ తో ప్రేక్షకులను కట్టిపడేసే కధనంతో సినిమాలు తీసే మురుగుదాస్...మహేష్ ని ఎలా చూపించనున్నాడో...ఎలాంటి కథను సిద్దం చేస్తున్నాడో అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com